Breaking News

జనవరి 1 నుంచి రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు

Published on Wed, 12/24/2025 - 06:10

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జూలై 1 నుంచి రైళ్ల వేళలను మార్చే వారు. ఇప్పుడు దాన్ని జనవరి 1 నుంచి మారేలా సవరించారు. దేశవ్యాప్తంగా 1,400 రైళ్ల వేళలను సవరిస్తుండగా, దక్షిణమధ్య రైల్వే పరిధిలో 80కిపైగా రైళ్ల వేళలు మారుతున్నాయి. 3 నిమిషాల నుంచి గరిష్టంగా 30 నిమిషాల వరకు ఈ సమయాలను మారుస్తున్నారు. వేళలు మారిన రైళ్ల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు.

జనవరి 1 నుంచి ప్రయాణాలు ఉన్నవారు మారిన రైళ్ల వివరాలను తెలుసుకుని తదనుగుణంగానే స్టేషన్‌కు రావాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1 తర్వాత ప్రయాణాలకు ముందస్తుగా టికెట్లు రిజర్వ్‌ చేసుకున్న ప్రయాణికులకు, వారు ప్రయాణించాల్సిన రైళ్ల వేళలు మారితే... ఆ సమాచారాన్ని మెసేజ్‌ రూపంలో వారికి పంపుతామని తెలిపారు.

కాగా, సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు తుది దశకు వచ్చిన నేపథ్యంలో, కొన్ని నెలలపాటు విడతల వారీగా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రైళ్ల రాకపోకలను నిలిపేయనున్నారు. తాజా మార్పులపై దీని ప్రభావం కూడా ఉండనుంది. ఇక ఇప్పటికే చర్లపల్లి టెరి్మనల్‌ అందుబాటులోకి వచి్చనందున చాలా రైళ్లను అక్కడి నుంచే నడుపుతున్నారు. త్వరలో మరికొన్ని రైళ్లు అక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనివల్ల కూడా కొన్నింటి వేళల్లో సవరణలు చోటుచేసుకుంటున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)