Breaking News

తెలంగాణకు రైల్వే కేటాయింపులు రూ.5,336 కోట్లు

Published on Thu, 07/25/2024 - 05:24

సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తాజా కేంద్రబడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,336 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. 2009–14 మ«ధ్య కాలంలో ఉమ్మడిరాష్ట్ర వార్షిక సగటు కేటాయింపులు రూ.886 కోట్లు మాత్రమేనని.. ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు ఆరురెట్లు ఎక్కువని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని రైల్‌భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అశ్వినీవైష్ణవ్‌ మాట్లాడారు. 

తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనుల మొత్తం అంచనావ్యయం రూ.32,946 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వేట్రాక్‌ పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా పూర్తయిందని చెప్పారు.  2009–2014 మధ్య కాలంలో రాష్ట్రంలో సంవత్సరానికి సగటున కేవలం 17 కి.మీ.మేర మాత్రమే కొత్త ట్రాక్‌ వేయగా,  గత పదేళ్లలో సగటున సంవత్సరానికి 65 కి.మీ. చొప్పున నూతన ట్రాక్‌ వేసినట్టు వెల్లడించారు. పదేళ్లలో 437 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించామని తెలిపారు. 

తెలంగాణలో 40 రైల్వే స్టేషన్‌లను అమృత్‌ భారత్‌స్టేషన్‌ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు.  రీజనల్‌ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా రైల్వేట్రాక్‌ ఏర్పాటు చేసే ప్రాజెక్టు పరిశీలనలో ఉందని, సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్న తెలంగాణలోని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా ఏర్పాటు చేసే కవచ్‌కు సంబంధించి 4.0 వెర్షన్‌కు ఆమోదం లభించిందని, దీని ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ప్రణాళిక సిద్ధమవుతుందని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.   

– వర్చువల్‌ పద్ధతిలో సికింద్రాబాద్‌ నుంచి దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ, నగర ప్రజారవాణాకు కీలకమైన ఎంఎంటీఎస్‌ రెండోదశకు సంబంధించి మిగిలిన పనులను రైల్వేశాఖ సొంత నిధులతో పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని, దీనికి రాష్ట్ర నిధుల కోసం ఎదురుచూడమని తేల్చిచెప్పారు. బీబీనగర్‌–గుంటూరు డబ్లింగ్‌ పనులు మొదలయ్యాయని, జోన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్‌ లోకోపైలట్‌ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)