ఈ పన్నీరు తింటే కన్నీరే..

Published on Fri, 06/19/2026 - 12:15

అబిడ్స్‌: పన్నీరు అంటే స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారని అధిక శాతం ప్రజలకు తెలుసు. కానీ జంట నగరాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీరు విక్రయ కేంద్రాల్లో కల్తీ జరుగుతోంది. పాలు లేని కల్తీ పన్నీర్‌ తింటున్న చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్‌– ఫాస్ట్‌ అధికారులు నగరంలోని 45 కల్తీ పన్నీరు తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. కల్తీ పన్నీరు, మలై పన్నీరు, చీజ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

గురువారం ఉస్మాన్‌గంజ్‌లోని హెచ్‌ ఫాస్ట్‌ కార్యాలయంలో టాస్‌్కఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంత మంది వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి చీజ్‌డ్‌ అనలాగ్‌ను తీసుకొచ్చి పన్నీరుగా తయారు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారు. అదే ఉత్పత్తిని లోప్యాట్‌ పన్నీర్, మీడియం ప్యాట్‌ పన్నీర్, ప్రెష్‌ పన్నీర్‌ వంటి తప్పుదారి పట్టించే పేర్లతో విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు. పన్నీరు ప్యాకెట్లపై బ్యాచ్‌ నంబర్, గడువు తేదీ లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.

కొంత మంది వ్యాపారులు అక్రమంగా లాభార్జన కోసం అక్రమాలకు పాల్పడున్నారని ఆయన చెప్పారు. పన్నీరు తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేయగా.. అధిక నీరు, పాలేతర కొవ్వులు, కృత్రిమ పాలు, ఆహారానికి అనర్హమైన పదార్థాలు కలపడం లాంటి కల్తీ చర్యలను గుర్తించామన్నారు. పన్నీరు ప్యాకెట్లపై లేబ్‌లింగ్‌ లేకపోవడంతో పాటు కేంద్రాల్లో చెల్లని లైసెన్సులు ఉండడం, అపరిశుభ్రమైన నిల్వ విధానాలను కూడా గుర్తించామన్నారు. కల్తీ, మిస్‌ బ్రాండెడ్‌ 825 కిలోల నకిలీ ఉత్పత్తులను స్వా«దీనపరచ్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు పన్నీరు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై లేబుల్, గడువు తేదీల వివరాలను తప్పనిసరిగా చూసి కొనుగోలు చేయాలని సూచించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)