Breaking News

ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి!

Published on Mon, 11/10/2025 - 03:56

కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్‌టీయూలో పాలన గాడి తప్పింది. సెక్యూరిటీ సిబ్బందితో విద్యార్థులు ఘర్షణ పడిన విషయం మరవకముందే, సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌ చేసిన అంశం తెరపైకి వచి్చంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

పరిచయాల పేరుతో పరేషాన్‌.. ఆపై ర్యాగింగ్‌ 
రెండురోజుల క్రితం కళాశాలలో ఫ్రెషర్స్‌ డే నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అశోక్‌ కుమార్‌ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ర్యాగింగ్, ఇతరత్రా అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అయితే వేడుకలకు సరిగ్గా రెండు రోజుల ముందు బాయ్స్‌ హాస్టల్లో కొందరు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడినట్టు వీడియో లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఫస్టియర్‌ చదు వుతున్న ఇద్దరు అబ్బాయిలతో హాస్టల్‌లో ఒకరినొకరు పెళ్లి చేసుకున్నట్టు తంతు నిర్వహించారు. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఈ తతంగాన్ని వీడియో తీశారు.  

సెక్యూరిటీ ఇన్‌చార్జితో ఘర్షణ...సస్పెన్షన్‌  
రెండురోజుల క్రితం సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ రాజిరెడ్డికి, విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ పరిస్థితిని మరింత వేడెక్కించింది. మద్యం సేవించి హాస్టల్లోకి వస్తున్న రాజిరెడ్డి.. తమను బూతులు తిడుతూ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు.ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు సెక్యూరిటీ ఇన్‌చార్జి రాజిరెడ్డిని సస్పెండ్‌ చేశారు.

ర్యాగింగ్‌ జరగలేదు
జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్‌ జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంటరాక్షన్‌లో భాగంగా సీనియర్లు, జూనియర్ల మధ్య ఒక ఫన్నీ గేమ్‌ ఘటనను గుర్తించాం. సంబంధిత విద్యార్థులను పిలిపించి విచారించాం. సీనియర్ల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, సరదా కోసం మాత్రమే వివాహ సన్నివేశంలో పాల్గొన్నామని విద్యార్థులు చెప్పారు.  – నరసింహ, జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపాల్‌ 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)