ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
ఖమ్మంలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
Published on Sat, 07/15/2023 - 17:26
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భూదాన్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. వెలుగుమట్లలో 147, 148,149 సర్వే నంబర్లలో భూదాన్కు సంబంధించిన 62 ఎకరాలు భూమి ఉంది. ఈ క్రమంలో 2014లోనే ఈ భూములకు సంబంధించి స్థానికులు దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం భూములను ఇవ్వలేదు. దీంతో, పోరాటం కొనసాగుతోంది. తాజాగా, పేదలు అక్కడ వేసుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ రావాలా: కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tags : 1