Breaking News

సద్దుమణగని ఆందోళనలు

Published on Mon, 10/28/2024 - 03:55

సాక్షి, హైదరాబాద్‌/సిరిసిల్ల క్రైం/ఖిలా వరంగల్‌: టీజీఎస్పీ పోలీసులకు సంబంధించిన సెలవుల విధానంలో మార్పు నేపథ్యంలో మొదలైన సిబ్బంది ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆందోళనల నేపథ్యంలో సస్పెండైన తమతోటి సిబ్బందిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, ఏక్‌ పోలీస్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు నాయ­కత్వం వహిస్తున్నారని గుర్తించిన 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ టీజీఎస్పీ అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

3, 4, 5 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెండ్‌ చేశారు. దీంతో కానిస్టేబుళ్లు ఆదివారం మరోమా రు ఆందోనకు దిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్‌ సిబ్బంది కాసేపు ఆందోళన చేశారు. సస్పెన్షన్‌ ఎత్తివేయాలని హైదరాబాద్‌ కొండాపూ ర్‌లోని 8వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు క్యాండిల్‌ మార్చ్‌ చేశారు. ములుగు జిల్లా చల్వాయి ఐదో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది ఏకంగా అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌జైన్‌కు లేఖ రాశారు. 

సస్పెండ్‌ చేసిన తమ తోటి సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అందరినీ సస్పెండ్‌ చేయాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు సిరిసిల్లలోని సర్దాపూర్‌ 17వ బెటాలియన్‌ పోలీసులు కూడా సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విన్నవించారు. కొద్దిసేపు బైఠాయించిన తర్వాత విధుల్లో చేరారు. 

అనంతరం ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేస్తున్న శాంతియుత నిరసనలను గమనించి ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు కొందరిపై సస్పెన్షన్‌ వేటు వేయడం సరికాదని అన్నారు. 

సివిల్‌ డ్రెస్‌తో ధర్నా 
ఏక్‌ పోలీస్‌ విధానం అమలు చేయాలని, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ మామునూరు టీజీ ఎస్పీ నా లుగో బెటాలియన్‌ గేటు వద్ద సిబ్బంది ధర్నాకు దిగారు. శనివారం బెటాలియన్‌ గేటు వద్ద ఆందో ళనకు దిగిన కానిస్టేబుళ్లు ఎస్‌.సతీష్, బి.రమేష్, డి.శ్రీనివాస్, సీహెచ్‌ ప్రశాంత్, పి.సంపత్‌ కె.వినోద్‌ను సస్పెండ్‌ చేస్తూ అదేరోజు రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం విధులకు హాజరైన స్పెషల్‌ పోలీసులు యూనిఫాం లేకుండా సివిల్‌ డ్రెస్‌తోనే బెటాలియన్‌ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరికి పోలీసు కుటుంబాల సభ్యులు బాసటగా నిలిచారు. 

ఫోకస్‌ పెంచిన ఉన్నతాధికారులు 
టీజీఎస్పీ సర్విస్‌ రూల్స్‌ ఏంటి?, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు ఏక్‌ పోలీస్‌ విధానం లేకపోవడం, టీజీఎస్పీ అన్నది పారామిలిటరీ ఫోర్స్‌ కాబ ట్టి అందుకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.. ఇలాంటి అనేక కోణాల్లో సిబ్బందికి నచ్చజెప్పేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వ డం లేదు. దీంతో తదుపరి చర్యలతోపాటు..ఆందోళన మూలాలపై పోలీస్‌ ఉన్నతాధికారులు ఫోకస్‌ పెట్టారు. 

ఇప్పటికే ఆయా బెటాలియన్లలో అడిషనల్‌ డీజీ స్థాయి నుంచి స్థానిక ఎస్పీల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇదే పద్ధతిలో మరింత లోతుగా యథార్థ పరిస్థితులను సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్న సందేశాన్ని మరింత గట్టిగా సిబ్బందికి పంపే యోచనలో పోలీస్‌ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)