Breaking News

అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం

Published on Sun, 04/02/2023 - 08:03

సాక్షి, హైదరాబాద్‌: అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరమని, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ తరపున పులుల రక్షణకు మద్దతు తెలుపుతున్నట్లు అడవులు, పర్యావరణంపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్రం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రవేశ పెట్టింది. శనివారం (ఏప్రిల్‌ 1) ఈ సేవ్‌ టైగర్‌ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి.

దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ టైగర్‌ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని సంతోష్‌ పేర్కొ న్నారు. 1973లో 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు చేరగా.. టైగర్‌ రిజర్వుల సంఖ్య తొమ్మిది నుంచి 53కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ టైగర్‌ ప్రాధాన్యాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. సేవ్‌ టైగర్‌ ఉద్యమం గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు విడుదల చేసిన టైగర్‌ బుక్, టీషర్ట్, కాఫీ మగ్‌ సావనీర్లను సంతోష్‌ ప్రదర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవ్వాల్‌ పులుల అభయారణ్యాన్ని బాగా నిర్వహిస్తోందని, పులుల సంఖ్య పెరుగుతోందన్నారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

(చదవండి: ఇక తిరుపతికి ఎనిమిదిన్నర గంటల్లోనే.. వేగంగా వెళ్లేందుకే ఆ మార్గం ఎంపిక.. )

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)