Breaking News

ఈఏపీ సెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి

Published on Tue, 12/30/2025 - 01:57

సాక్షి, హైదరాబాద్‌/ఉస్మానియా యూనివర్సిటీ/ కేయూ క్యాంపస్‌/: వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. ఈ వివరాలను మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి సోమవారం మీడి యాకు వెల్లడించారు. అత్యంత కీల కమైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌ ప్రొఫెసర్‌ కె.విజయకుమార్‌ రెడ్డిని ఎంపిక చేశారు. ఈఏపీసెట్‌కు రాష్ట్రంలో దరఖాస్తులు పెరగడం, నిర్వహణ విషయంలో మరింత పారదర్శకత ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విజయకుమార్‌రెడ్డి జే ఎన్టీయూ మెకానికల్‌ విభాగంలో సీని యర్‌ ప్రొఫెసర్‌గా, జేఎన్టీయూ రెక్టార్‌ బాధ్యతల్లో ఉన్నారు. ఎప్‌సెట్‌తో పాటు మొత్తం ఏడు ప్రవేశ పరీ క్షల కన్వీనర్లను, ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సి టీలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ఖరారు చేశారు.  గత సంప్రదా యాలను పక్కనబెట్టి.. పాత వారితో పాటు కొత్త వారికి కన్వీనర్‌ బాధ్యతలప్పగించారు. ఎప్‌సెట్, పీఈసెట్, పీజీఈసెట్‌ కన్వీనర్లుగా కొత్త వారికి అవకాశమిచ్చారు. ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ కన్వీనర్లుగా పాత వారికే అవకాశమిచ్చారు.  

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)