Breaking News

మన మక్కలెన్ని?

Published on Sat, 06/13/2026 - 05:12

సాక్షి, హైదరాబాద్‌: ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన మక్కల పరిమాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఉత్పత్తి అయిన దానికంటే ఎక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరిగినట్టు కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి మక్కలు తెలంగాణ మార్కెట్లకు తరలివచ్చాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

⇒ ఖమ్మంలో అటు ఇటుగా 3 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను కొనుగోలు చేస్తే..భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రం 48 వేల మెట్రక్‌ టన్నులే సేకరించడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోనే ఇంత తేడా ఎలా వచ్చిందనే అనుమానాలు ఉన్నాయి.  

⇒ నాగర్‌కర్నూల్‌లో 1.66 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను సేకరించగా, ఏపీలోని కర్నూలును ఆనుకొని ఉన్న గద్వాల జిల్లాలో 60 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. కానీ పక్కనే ఉన్న వనపర్తిలో 16 వేల మెట్రిక్‌ టన్నులు, మహబూబ్‌నగర్‌లో 14 వేలు, నారాయణపేటలో 1,122 మెట్రిక్‌ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది.  
⇒ నిర్మల్‌ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ జిల్లాలోనే అత్యధికంగా 1.71 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలు సేకరించగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ మూడు జిల్లాలలో కలిపి కూడా 40 వేల టన్నులు కూడా కొనుగోలు చేయలేదు.  

⇒ దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన మక్కలన్నీ నిజంగా తెలంగాణ రైతుల నుంచే వచ్చాయా, లేక ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, దళారులు తీసుకొచ్చిన మక్కలు కూడా కొనుగోళ్లలో చేరాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ఏపీలో మద్దతు లేక తెలంగాణకు మక్కలు 
వ్యవసాయ మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం.. పక్క రాష్ట్రాల్లో మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. కనీస మద్దతు ధర రూ.2,400 ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మార్కెట్‌లో రైతులు రూ.1,500 నుంచి రూ.1,600కు విక్రయించారు. ఆ రాష్ట్రంలో మార్క్‌ఫెడ్‌ ఎంఎస్‌పీకి కొనుగోలు చేయలేదు. దీంతో రైతుల నుంచి రూ.1,500కి క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు, దళారులు అవే మక్కలను అక్రమ మార్గాల ద్వారా తెలంగాణకు తీసుకొచ్చి విక్రయించినట్టు తెలుస్తోంది. ఇందుకు ఆయా జిల్లాల్లోని మార్క్‌ఫెడ్‌ మేనేజర్లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాలతోపాటు ఏపీ మక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మల్‌తోపాటు కామారెడ్డి, నిజామాబాద్‌లకు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఉండొచ్చని మార్క్‌ఫెడ్‌లోనే చర్చ జరుగుతోంది.

మక్కల విక్రయానికి టెండర్లు... 15న మొదటి వేలం
రైతుల నుంచి సేకరించినట్టు చెబుతున్న మక్కల విక్రయానికి తెలంగాణ మార్క్‌ఫెడ్‌ ఈ నెల 7న ఈ–టెండర్లను ఆహా్వనించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిల్వలో ఉన్న మక్కలను మూడు విడతల్లో వేలం వేయనున్నారు. తొలి విడతలో ఈ నెల 15న 16 లాట్‌లను విక్రయించనుండగా, 16, 17 తేదీల్లో మరో రెండు విడతల్లో బిడ్‌లను తెరవనున్నారు. ఒక్కో విడతలో సగటున 4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర మక్కలను వేలం వేయనున్నట్టు సమాచారం.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)