Breaking News

తడబడుతూ.. ముందుకు?!

Published on Sat, 08/12/2023 - 00:57

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైన్‌షాపుల నిర్వహణ కోసం రానున్న రెండేళ్ల కాలానికి లైసెన్సులు పొందేందుకు గాను చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ గతంతో పోలిస్తే తడబడుతూ ముందుకెళుతోంది. 2023–25 సంవత్సరాలకు గాను వైన్‌షాపులకు లైసెన్సులను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు గాను ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎనిమిదో రోజు శుక్రవారం ముగిసేనాటికి 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ గణాంకాలు చెపుతున్నాయి.

అదే గత ఏడాది తొలి ఎనిమిది రోజుల్లో 14,500 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. తొలి ఏడు రోజుల్లో ఈసారి 8వేల వరకు దరఖాస్తులు రాగా, గతంలో 9వేల వరకు వచ్చాయి. గతంతో పోలిస్తే తొలి వారంలో దరఖాస్తుల సంఖ్య తగ్గినా, శుక్రవారం చివరి నిమిషంలో పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులతో ఎౖMð్సజ్‌ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

అయితే,  గతంలో షెడ్యూల్‌ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ కోసం 10 రోజులు సమయం ఇవ్వగా, ఈసారి 12 రోజులు సమయం ఇచ్చారు. రెండో శనివారం అయినప్పటికీ 12వ తేదీన కూడా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆదివారం, ఆగస్టు 15 సెలవు దినాలు కావడంతో మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో 16,17,18 తేదీల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.

గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 68 వేలకు పైగా దరఖాస్తులు రాగా, దరఖాస్తు రుసుంతో పాటు తొలి వాయిదా ఎక్సైజ్‌ ఫీజు కలిపి మొత్తం రూ.1,691 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే, ఈసారి ఆ స్థాయిలో దరఖాస్తులు వస్తాయా రావా అన్న మీమాంసలో ఎక్సైజ్‌ వర్గాలుండడం గమనార్హం.

రెండు పిల్‌లు, రెండు రిట్‌లు
ఇక, మద్యం దుకాణాల కేటాయింపుపై గతం నుంచీ నాలుగు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వైన్‌షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయడంపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, మరో రెండు రిట్‌ పిటిషన్‌లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడు ఈసారి మరో రెండు కేసులు కోర్టుల్లో నమోదయ్యాయి.

కొత్తగూడెం ఏరియాలోని కొన్ని దుకాణాలు షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్నప్పటికీ గిరిజనులకు వాటికి కేటాయించకుండా జనరల్‌ కేటగిరీలో చూపెట్టారని ఒక పిటిషన్‌ దాఖలు కాగా, గిరిజనులకు రిజర్వేషన్లు కేటాయించడంలో రాష్ట్రమంతటా ఒకే విధానాన్ని పాటించడం లేదంటూ మరొక పిటిషన్‌ ఈసారి దాఖలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయోననే ఆసక్తి కూడా అటు ఎక్సైజ్‌ వర్గాల్లోనూ, ఇటు మద్యం వ్యాపారుల్లోనూ వ్యక్తమవుతుండడం గమనార్హం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)