Breaking News

ORR: ఔటర్‌పై ప్రైవేటు బస్సు బోల్తా

Published on Mon, 06/24/2024 - 08:02

మణికొండ: హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆదివారం రాత్రి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్‌  తెలిపిన మేరకు..  మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు (పీవై 05 ఎ 1999) గచ్చిబౌలి  నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శంషాబాద్‌ వైపు వెళుతోంది.

 నార్సింగి వద్ద అదుపు తప్పి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై డివైడర్‌ను ఢీ కొని పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ బస్సు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతురాలు ఒంగోలుకు చెందిన మమత(33) అని, ఆమె ఉప్పల్‌లో ఉంటుందని తెలిసిందన్నారు. బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు.  బస్సు బోల్తా కొట్టడంతో గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. 

ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు హుటాహుటిన సంఘటనా స్థలానికి  చేరుకుని బస్సులో చిక్కుకు పోయిన వారిని బయటకు తీశారు. ఇదిలా ఉండగా  బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానం రావటంతో అతన్ని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.  మరి కొందరికి స్వల్ప గాయాలు కావటంతో వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామన్నారు.  ఔటర్‌రింగ్‌ రోడ్డుపై బోల్తా కొట్టిన బస్సును రెండు క్రేన్‌ల సహాయంతో పక్కకు తప్పించి రెండు గంటల అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)