Breaking News

రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్‌

Published on Sun, 11/02/2025 - 04:53

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవటంతో తెలంగాణ ప్రైటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఏటీహెచ్‌ఏ) ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రైవేటు కళాశాలలను నిరవధికంగా బంద్‌ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫతి చైర్మన్‌ ఎం రమేశ్‌బాబు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించేవరకు కళాశాలలను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 6న ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న లక్షన్నర మంది సిబ్బందితో హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ.900 కోట్లు ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచి్చన హామీ ప్రకారం నిధులు విడుదల చేయకుంటే సోమవారం నుంచి బంద్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. పరీక్షలు వాయిదా వేయాలని యూనివర్సిటీలు కోరుతున్నామని చెప్పారు. ఈ నెల 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.

ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను, కలెక్టరేట్లను ముట్టడిస్తామని తెలిపారు. రూ.1,200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. ఈ సమావేశంలో ఫతి సెక్రటరీ జనరల్‌ కెఎస్‌.రవికుమార్, వైస్‌ చైర్మన్‌ అల్లాపూర్‌ శ్రీనివాస్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)