Breaking News

ప్రైవేటులో ఎంబీబీఎస్‌ ఫీజుల ఖరారు

Published on Tue, 08/08/2023 - 01:42

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల ఫీజులను సవరించారు. కొన్ని కాలేజీల్లో పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయి. మరికొన్ని కాలేజీల్లో యథాతథంగా ఉన్నాయి. ఫీజుల సవరణకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇచ్చిన సిఫార్సులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అనుమతించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.

2023–26 మధ్య చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు ఇదే రుసుము కొనసాగుతుందని ఆయన తెలిపారు. బీ–కేటగిరీ ఎంబీబీఎస్‌ ఫీజులు కొన్ని కాలేజీల్లో రూ. 50 వేలు పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయని వివరించారు. ఉదాహరణకు అపోలో మెడికల్‌ కాలేజీలో బీ–కేటగిరీ ఎంబీబీఎస్‌కు గతంలో రూ. 12.50 లక్షలున్న ఫీజును ఈ ఏడాది నుంచి రూ. 13 లక్షలకు పెంచారు. అయాన్‌ మెడికల్‌ కాలేజీలో గతంలో రూ. 14 లక్షలున్న బీ–కేటగిరీ ఫీజును ఇప్పుడు రూ. 12 లక్షలకు తగ్గించారు.

సీ–కేటగిరీ ఫీజులను బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు చేశారు. అంటే బీ–కేటిగిరీ ఫీజు రూ. 12 లక్షలున్న కాలేజీలో సీ–కేటగిరీ ఫీజు రూ. 24 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. మొత్తంగా సరాసరి 5 శాతం ఫీజులు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. స్వల్పంగానే ఫీజులు పెరిగాయని.. కొన్నిచోట్ల తగ్గాయని అధికారులు చెబుతున్నారు. 

ఒక్కో మెడికల్‌ కాలేజీలో ఒక్కో ఫీజు... 
రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో 56 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 35 శాతం సీట్లు బీ–కేటగిరీ, 15 శాతం సీ–కేటగిరీ సీట్లుంటాయి. వాటిని మేనేజ్‌మెంట్‌ కేటగిరీ సీట్లుగా పరిగణిస్తారు.

మిగిలిన 50 శాతం సీట్లు ఏ–కేటగిరీ (కన్వినర్‌) కిందకు వస్తాయి. కాలేజీలవారీగా నిర్వహణ ఖర్చు లు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర వివరాలతో కూడిన ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించిన టీఏఎఫ్‌ఆర్‌సీ... వాటి ఆధారంగానే ఫీజుల సవరణకు సిఫార్సు చేసింది. అయితే ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సీట్ల ఏ–కేటగిరీ ఫీజు రూ. 60 వేలు ఉండగా అందులో ఎలాంటి మార్పు చేయలేదు. 

అదనపు వసూళ్లు చేయరాదు... 
కాలేజీలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం విద్యార్థుల నుంచి ఎటువంటి క్యాపిటేషన్‌ రుసుము వసూలు చేయరాదని కాళోజీ వర్గాలు స్పష్టం చేశాయి. కమిటీ నిర్ణయించిన రుసుము మినహా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఇతర మొత్తాన్ని యాజమాన్యం అనధికారికంగా లేదా చట్టవిరుద్ధంగా వసూలు చేయకూడదని పేర్కొన్నాయి. ఒకవేళ విరా ళం ముసుగులో వసూలు చేసినట్లయితే దాన్ని క్యాపిటేషన్‌ రుసుముగా పరిగణించనున్నాయి.

అయితే తదుపరి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్‌ ఫీజు కోసం కాలేజీలు బ్యాంక్‌ గ్యారెంటీని విద్యార్థుల నుంచి తీసుకోవచ్చని స్పష్టం చేశాయి. దీనిపై గతం నుంచే విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఈ నిబంధనను ఇంకా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల ఫీజులను పెంచలేదని కాళోజీ వర్గాలు తెలిపాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)