Breaking News

ఇంటర్‌ కాలేజీల ఇష్టారాజ్యం

Published on Mon, 06/09/2025 - 01:07

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కాలేజీలు విద్యార్థులను చేర్చుకోవడంపై పెట్టే దృష్టి అనుబంధ గుర్తింపు తెచ్చుకోవడంపై పెట్టడం లేదు. నిబంధనలన్నీ పాటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి కాలేజీలపై ఇంటర్‌ బోర్డు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. మరో వారం రోజుల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు మొదలవుతాయి. 

ఈలోగానే కాలేజీలు బోర్డు అనుమతి తీసుకోవాలి. కాలేజీల్లో చేరికలు, బోర్డ్‌ అనుమతులు, సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో నిత్యం అందుబాటులో ఉంచాలి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. బోర్డు అధికారులు కూడా ఈ కాలేజీలపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. గుర్తింపు విషయంలో కంగారు వద్దంటూ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు.   

సగం కూడా పూర్తవ్వని అఫిలియేషన్‌ 
రాష్ట్రవ్యాప్తంగా 4,089 ఇంటర్‌ కాలేజీలున్నాయి. 3,254 కాలేజీలు అఫ్లియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో అనుబంధ గుర్తింపు పొందినవి 1,312 మాత్రమే. 1,483 కాలేజీల దరఖాస్తులను బోర్డ్‌ తిరస్కరించింది. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలని కోరింది. సరైన లొకేషన్‌ లేదని 1,216 కాలేజీలను పెండింగ్‌లో ఉంచారు. 

ప్రతీ ఏటా అఫ్లియేషన్‌కు దరఖాస్తు చేసే కాలేజీలు సైతం సరైన విధానంలో వెళ్లడం లేదని, ధ్రువపత్రాల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని బోర్డు అధికారులు అంటున్నారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ఇచ్చిన తర్వాతే క్లాసులు నిర్వహించాలనే నిబంధన విధించాలని బోర్డు నిర్ణయించినా, జిల్లా అధికారులు మాత్రం దీన్ని అమలుచేయడం లేదు. ఈ కారణంగానే అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవ్వడం లేదు.  

రాజధాని పరిసరాల్లోనే సమస్యలు 
రాజధాని పరిసర ప్రాంతాలైన మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిల్లో చాలావరకు బహుళ అంతస్తుల భవానాల్లోనే నడుస్తున్నాయి. వీటిని జిల్లాలకు దూరంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కాలేజీలు దీనికి అడ్డుపడ్డాయి. కాలేజీలు దూరంగా ఉంటే విద్యార్థులను చేర్చుకోవడం కష్టమని భావిస్తున్నా­యి. 

ఇలాంటి కాలేజీల జాబితాను అధికారులు తెప్పించారు. ప్రభుత్వానికి కూడా ఇటీవల నివేదించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. గుర్తింపు రాకుండానే విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.  

ఈసారీ అదే తంతా? 
బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీ వల్ల విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని ఫైర్‌ సేఫ్టీ విభాగం 2020లోనే స్పష్టం చేసింది. ఇలాంటి భవనాలు ఫైర్‌ సేఫ్టీ విభాగం నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 6–15 మీటర్ల ఎత్తున్న కాలేజీ భవనాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిని పరిశీలించి ఫైర్‌ సేఫ్టీ విభాగం అనుమతినివ్వాలి. కానీ రాజధాని పరిసరాల్లో ఎక్కువగా 15 మీటర్లకుపైగా ఎత్తున్న భవనాల్లో నడుస్తున్నాయి. 

రెండేళ్లుగా ఫైర్‌సేఫ్టీ విభాగం ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. అయినా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. పరీక్షల సమయం వరకూ విద్యార్థుల్లో టెన్షన్‌ నెలకొంటోంది. చివరకు ఒక్క సంవత్సరం కోసం అనుమతి ఇవ్వడం, వచ్చే ఏడాది నుంచి ఇవ్వబోమని చెప్పడం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచి ఇలాంటి కాలేజీల అనుమతి నిలిపివేయాల్సి ఉంది. కానీ ఇలాంటి చర్యలేమీ బోర్డు తీసుకోలేదు. అఫ్లియేషన్ల విషయంలో తాత్సారం తగదని తల్లిదండ్రులు అంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)