Breaking News

వ్యాధి ఒకటి.. వైద్యం మరొకటి..

Published on Wed, 01/21/2026 - 09:25

కామారెడ్డి టౌన్‌: ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్లక్ష్యానికి వృద్ధుడు బలయ్యాడు. వ్యాధి ఒకటి కాగా.. సంబంధం లేని వైద్యం అందించడంతో అతడు మృత్యువాతపడ్డాడు. జిల్లాకేంద్రంలో మంగళవారం వెలుగు చూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. దోమకొండ మండలం అంచనూరు గ్రామానికి చెందిన నాగ బాలరాజు(70) నరాల బలహీనత, థైరాయిడ్, బీపీ సమస్యలతో ఈనెల 17నజిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ సమీపంలోగల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు.

 అయితే ఆస్పత్రి సిబ్బంది పొరపాటున బాలరాజుకు వేరొక పేషెంట్‌ ఫైల్‌ను ఇచ్చారు. ఆ ఫైల్‌లోని ప్రి్రస్కిప్షన్‌ ఆధారంగా ఆస్పత్రిలోని మెడికల్‌ షాప్‌లో మందులు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లాక ఆ మందులు వేసుకున్నాడు. బాలరాజుకు షుగర్‌ వ్యాధి లేనప్పటికీ వేరే వ్యక్తి ఫైలులో ఉన్న షుగర్‌ టాబ్లెట్లు వేసుకోవడంతో ఆయన శరీరంలో షుగర్‌ లెవల్స్‌ ఒక్కసారిగా పడిపోయాయి. 

దీంతో అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం అదే ఆస్పత్రికి వెళ్లాడు. ఆ సమయంలో ఫైల్‌ మారిన విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించి, కొత్త మందులు ఇచ్చారని బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మరణించాడని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే బాలరాజు మరణించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)