Breaking News

ప్రింటింగ్‌ దోశ..

Published on Tue, 07/09/2024 - 12:18

కాగితంపై అక్షరాలు ప్రింట్‌ తీయడం చూశాం.. ఫొటోలు ప్రింట్‌ తీయడం చూశాం.. ఫ్లెక్సీలు ప్రింట్‌లు వస్తున్నాయి. ప్రింటర్లలోనూ కలర్, బ్లాక్‌ అండ్‌ వైట్, 3డీ, ఇంకా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దోశను ప్రింట్‌ తీయడం ఎప్పుడైనా విన్నారా.. కొత్తగా ఉంది కదూ.. నిజమే ఇటీవల కాలంలో మార్కెట్‌లోకి కొత్తగా దోశ మేకర్‌ (ప్రింటర్‌) అందుబాటులోకి వచి్చంది. వంటింట్లో ఇప్పటికే అనేకరకాలైన ఆధునిక వస్తువులు వినియోగిస్తున్నాం. తాజాగా చెన్నైకి చెందిన ఓ సంస్థ దోశ ప్రింటర్‌ను అభివృద్ధి చేసింది. ప్రింటర్‌కు ఒక వైపు ట్రే ఉంటుంది. అందులో పిండి వేస్తే సరిపోతుంది.

నిమిషానికి ఒక దోశ వస్తుంది. దోశను ఎంత మందంతో కావాలనుకుంటే ఆ విధంగా మనం మర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌ ఆటోమేటిక్‌ దోశ మేకర్‌కు 360 డిగ్రీల ఫుడ్‌ గ్రేడ్‌ కోటెడ్‌ రోలర్‌ అమర్చి ఉంటుంది. ఈ యంత్రం 1600 వాట్ల విద్యుత్తు శక్తితో పనిచేస్తుంది. అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తుందని తయారీ సంస్థ పేర్కొంటోంది. పరిమాణం చిన్నగా ఉండటంతో వంట గదిలో ఇట్టే ఇమిడిపోతుంది. ఆటోమేటిక్‌ సేఫ్టీ కట్‌ఆఫ్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. 3 నిమిషాలు వినియోగించకపోతే దానంతట అదే పవర్‌ ఆఫ్‌ అయిపోతుందట. ఒక్కో ప్రింటర్‌ రూ.13 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)