Breaking News

త్వరలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

Published on Thu, 09/26/2024 - 04:54

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మెడికల్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. 

ఇప్పటికే అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 643 మంది అధ్యాపకులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించారు. ఇవిగాక మరో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను రెగ్యులర్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 

ఈ మేరకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్విసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు మంత్రి అనుమతి ఇచ్చారు. అవసరమైతే మరో విడతలోనూ అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మరోవైపు ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.  

2 వారాల్లో 3,967 పోస్టులకు నోటిఫికేషన్లు 
కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునీకరణ తదితర కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నర్సింగ్‌ ఆఫీసర్‌ నియామకాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందిని భర్తీ చేశారు. 285 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 48 మంది ఫిజియోథెరపిస్టులు, 18 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. మొత్తంగా ఇప్పటివరకూ 7,308 పోస్టులు భర్తీ చేశారు. 

గత రెండు వారాల్లో 4 వేల పోస్టులకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు, ఈ నెల 17వ తేదీన మరో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు, రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. వీటితోపాటు 1,666 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫీమేల్‌), 156 ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్, 435 సివిల్‌ సర్జన్, 24 ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 

మరోవైపు వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1,600 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఫైల్‌ పంపింది. ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా మని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.   

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు