Breaking News

‘కాళేశ్వరం’పై ప్రాథమిక నివేదిక రెడీ!

Published on Tue, 01/21/2025 - 06:28

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న విచా రణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో కమిషన్‌ గుర్తించిన అంశాలు, అవకతవకలు, ఇతర అంశాలపై సుమారు 204 పేజీలతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. నివేది కలో దాదాపుగా 12 అధ్యయనాల వివరాలున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేల సంఖ్యలోని ఫైళ్లను అధ్యయనం చేయడంతోపాటు సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో సేకరించిన వివరాలను నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.

బరాజ్‌ల నిర్మా ణంతోపాటు ఇతర పనుల్లో అవకతవకలు జరిగినట్టుగా కమిషన్‌ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించడానికి బరాజ్‌ల అంచనాలను ఏటేటా పెంచడంతోపాటు జరగని పనులకు కూడా రూ.కోట్లలో బిల్లులు జారీ చేసినట్టుగా ఆధారాలను సేకరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బరాజ్‌లకు సంబంధించిన విధానపర నిర్ణయాలు, సాంకేతిక, ఆర్థికపర అంశాలపై విచారణ దాదాపు పూర్తయిందని.. మరికొందరు సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తే విచారణ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నాయి. ఇక జనవరి, ఫిబ్రవరిలో రెండు పర్యాయాలు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి.. మిగతా వారిని ప్రశ్నించేందుకు కమిషన్‌ సన్నద్ధమైనట్టు తెలిసింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టి చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 

ఇవాల్టీ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం

రామకృష్ణారావుకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌.. 
ఇప్పటికే పలు దఫాలుగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి 80 మందికిపైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌ అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్‌ కమిషన్‌.. మంగళవారం నుంచి మరో దఫా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలిరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ప్రశ్నించనుంది. కాళేశ్వరం కార్పొరేషన్‌ కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కమిషన్‌ ఆయనను విచారించనుంది. బీఆర్‌ఎస్‌ నేత వి.ప్రకాష్, బరాజ్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్‌ నిర్వహించిన కాగ్‌ అధికారులనూ ఇదే విడతలో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 

వచ్చే నెలలో కేసీఆర్, హరీశ్, ఈటలకు పిలుపు 
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల, ఆర్థిక మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్‌ వచ్చే నెలలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించనున్నట్టు తెలిసింది. వారికి సమన్లు జారీ చేయడానికి ముందే బలమైన ఆధారాలను సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. చివరగా కేసీఆర్‌ను ప్రశ్నించడం ద్వారా కమిషన్‌ విచారణను ముగించి, ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే యోచనతో ఉన్నట్టు తెలిసింది. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)