Breaking News

అక్కడ కాన్పులు ‘సాధారణం’!

Published on Sun, 02/09/2025 - 03:20

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఓవైపు ప్రసవాల కోసం కడుపు‘కోత’లు (సిజేరియన్లు) పెరుగుతున్నప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో మాత్రం నేటికీ సాధారణ ప్రసవాలే అత్యధికంగా జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని శివారు గ్రామాల్లో నిండు గర్భిణులు నార్మల్‌ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పురిటినొప్పులు భరించేందుకే మొగ్గుచూపుతున్నారు తప్ప శస్త్రచికిత్సలకు ఇష్టపడటంలేదు. 

తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేయించుకుంటున్నారు. ఆయా గ్రామాల పరిధిలో గత ఐదేళ్లలో జరిగిన కాన్పుల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే 90 శాతానికిపైగా సాధారణ ప్రసవాలే జరగడం గమనార్హం. 

జీవన విధానమూ భిన్నమే.. 
మూడు రాష్ట్రాల కూడలిగా.. త్రిభాషా సంగమంగా పిలిచే జుక్కల్‌ నియోజకవర్గంలోని జుక్కల్, పెద్దకొడప్‌గల్, డోంగ్లీ, మద్నూర్‌ తదితర మండలాల్లో ప్రజల ఆచార వ్యవహారాలతోపాటు జీవన విధానం కూడా భిన్నమే. 

వ్యవసాయమే వారి జీవనాధారం. రాళ్ల భూములే అయినా వాటిలోనూ రకరకాల పంటలు పండిస్తారు. ఇంటిల్లిపాదితోపాటు గర్భిణులు సైతం పొద్దున్నే పొలంబాట పడుతుంటారు. ఒక్కోసారి పొలం పనులకు వెళ్లిన గర్భిణులకు పురిటినొప్పులు మొదలై పొలం దగ్గరే కాన్పులు జరిగిన ఘటనలు సైతం ఉన్నాయి. 

పీహెచ్‌సీలకే ప్రాధాన్యం.. 
మారుమూల గ్రామాలైనప్పటికీ ప్రభుత్వ వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. దీంతో వారంతా దూరాన ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్లకుండా నొప్పులు మొదలవగానే ప్రభుత్వ అంబులెన్స్‌ల ద్వారానే సమీపంలోని పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. అక్కడి వైద్య సిబ్బంది ఏదైనా సమస్య ఉందని గుర్తిస్తే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి లేదా నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. 

హైరిస్క్‌ ఉంటేనే రిఫర్‌ చేస్తాం 
మా దగ్గర నార్మల్‌ డెలివరీలే చేస్తాం. హైరిస్క్‌ ఉంటే బాన్సువాడకు రిఫర్‌ చేస్తాం. గర్భిణులు మా సిబ్బంది చెప్పి నట్లు నడుచుకుంటారు. తప్పని సరి అయితేనే సిజేరియన్‌కు ఒప్పుకుంటారు.   – డాక్టర్‌ విఠల్‌ పాటిల్, మెడికల్‌ ఆఫీసర్, జుక్కల్‌ 

చెప్పినట్టు వింటారు 
మా ఊళ్లో అందరూ ఏఎన్‌ఎం వచ్చిన రోజు వచ్చి చెకప్‌ చేయించుకుంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి డెలివరీ అయ్యేదాకా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. అందుకే నార్మల్‌ డెలివరీలు అవుతాయి.   – కవిత, అంగన్‌వాడీ టీచర్, శివాపూర్‌ 

రెండు కాన్పులూ నార్మలే... 
నాకు రెండు కాన్పులూ నార్మల్‌గానే జరిగాయి. అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు అందిస్తారు. భోజనం పెడతారు. మా ఊళ్లో అందరూ నార్మల్‌ డెలివరీ అవుతారు.  – సరోజన, బాలింత, శివాపూర్‌ 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)