Breaking News

ప్రసవం కోసం వెళ్తే ప్రాణం పోయింది..

Published on Sun, 04/20/2025 - 12:27

జడ్చర్ల(మహబూబ్‌నగర్): పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణి మృత్యువాత పడిన ఘటన జడ్చర్ల పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్‌ వివరాల మేరకు.. రాజాపూర్‌ మండలం మల్లేపల్లికి చెందిన రేణుక (24)ను నవాబుపేట మండలం పల్లెగడ్డకు చెందిన నరేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. 

వీరు హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే రేణుక మొదటి కాన్పు కోసం తల్లిదండ్రులు శుక్రవారం జడ్చర్ల ఇందిరానగర్‌ కాలనీలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యురాలు ఆమెను పరీక్షించి జాయిన్‌ చేసుకున్నారు. రాత్రివేళ ఆకస్మికంగా ఆమెకు ఫిట్స్‌ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సదరు ఆస్పత్రి వైద్యురాలు మెరుగైన వైద్యం కోసం తన వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, తన కూతురు మరణంపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి వడ్డె పరశురాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య రేణుక మృతిచెందిందని భర్త నరేందర్‌తో పాటు బంధువులు మొదట ఆరోపించారు. తన భార్యకు ఎప్పడూ ఫిట్స్‌ రాలేదని.. కానీ ఫిట్స్‌ వచ్చినట్లు తనకు ఫోన్‌లో తెలిపారన్నారు. విషయం తెలుసుకుని తాను ఆస్పత్రికి వచ్చే సరికే పేషంట్‌ కండీషన్‌ సీరియస్‌గా ఉందంటూ జిల్లా ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కాగా, గర్భిణి మృతికి సంబంధించి సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు, మృతురాలి కుటుంబీకుల మధ్య చర్చలు సాగినట్లు సమాచారం.

గర్భిణి మృతిపై విచారణ..
గర్భిణి మృతిపై మాస్‌ మీడియా అధికారిణి మంజుల శనివారం విచారణ జరిపారు. సదరు ఆస్పత్రి డాక్టర్‌ నీలోఫర్‌ జగీర్ధార్‌తో వివరాలు సేకరించారు. అయితే వైద్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని.. పరిస్థితి విషమంగా ఉండటంతో తన కారులో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యురాలు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామని మాస్‌ మీడియా అధికారిణి పేర్కొన్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)