Breaking News

ముందు కౌన్సెలింగ్‌... తర్వాతే క్లాసులు

Published on Sat, 08/09/2025 - 03:15

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఇంజనీరింగ్‌ విద్యలోకి ప్రవేశించే విద్యార్థులకు మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ముందుగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. మానసికంగా బలోపేతం అయ్యేలా కొన్ని రోజులపాటు కార్యక్రమాలు ఉండాలని పేర్కొంది. ప్రతీ కాలేజీలోనూ కౌన్సెలింగ్‌ కేంద్రాన్నిఏర్పాటు చేయాలని సూచించింది. అర్హులైన కౌన్సెలర్లతో కచ్చితంగా కౌన్సెలింగ్‌లు అమలయ్యేలా యూనివర్సిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీలే కాకుండా, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టంచేసింది.  

ఒత్తిడిని గుర్తించాలి 
ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థుల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడి కనిపిస్తోంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు సాధించినా ఒత్తిడికి గురవుతున్నారు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఇది తీవ్రంగా ఉందని ఐఐటీలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2018 నుంచి 2025 వరకు ఐఐటీల్లో 39 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 25 మంది, ఎన్‌ఐటీల్లో 25 మంది, ఇతర సంస్థల్లో ఐదుగురు విద్యార్థులు ఈ ఒత్తిడితోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆత్మహత్యలు మూడేళ్లలో 120 వరకు నమోదయ్యాయి. ఇంటర్‌లో బట్టీ విధానం ద్వారా మంచి ర్యాంకులు పొందుతున్నారు. ఇంజనీరింగ్‌ తొలి ఏడాది నుంచే సొంతంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటోంది. దీంతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు.  

కౌన్సెలింగే మార్గం 
క్లాసులు మొదలయ్యే ముందు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయాలి. న్యూనతా భావంతో ఉన్న విద్యార్థులను వ్యక్తిగతంగా కౌన్సెలర్లు పిలిచి మాట్లాడాలి. వాళ్ల కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఏఐసీటీఈ సూచించింది. విద్యార్థి ఎక్కడ, ఏ విషయంలో భయపడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? అనే విషయాలను పరిశీలించాలి. వారికి అర్థమయ్యే విధానంలో బోధన చేయడం ముఖ్యం. ఇంటర్మిడియెట్‌తో పోలిస్తే ఇంజనీరింగ్‌లో సిలబస్‌ భిన్నంగా ఉంటుంది. విశ్లేషణాత్మకంగా ఉండటం, దాన్ని మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా బేరీజు వేసుకోవడం తప్పనిసరి. ఈ దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఉన్నత విద్యా మండళ్లు, వర్సిటీలు కౌన్సెలింగ్‌ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించి, పురోగతిని విశ్లేషించడం ద్వారా విద్యార్థుల్లో మానసిక ధైర్యం పెంచాలని సూచించింది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)