Breaking News

పవర్‌గ్రిడ్‌ చెస్‌ టోర్నీ విజేత కార్పొరేట్‌ సెంటర్‌ 

Published on Mon, 07/31/2023 - 02:49

సాక్షి, హైదరాబాద్‌: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఇంటర్‌ రీజినల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో మహిళల టీమ్‌ విభాగంలో కమలేశ్‌ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్‌ సెంటర్‌ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్‌ సెంటర్‌ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్‌గ్రిడ్‌ సదరన్‌ రీజియన్‌–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్‌ విభాగంలో ఈస్టర్న్‌ రీజియన్‌–1కు రెండో స్థానం, నార్తర్న్‌ రీజియన్‌–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్‌ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్‌ తివారీ, హృషికేశ్‌ సింగ్, బిజిత్‌ శర్మలతో కూడిన నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ చాంపియన్‌గా నిలిచింది.

నార్తర్న్‌ రీజియన్‌–1కు రెండో స్థానం, కార్పొరేట్‌ సెంటర్‌కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్‌ సేన్‌ (కార్పొరేట్‌ సెంటర్‌), బిశ్వజ్యోతి దాస్,  గౌరవ్‌ కుమార్‌ (నార్తర్న్‌ రీజియన్‌–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్‌ (నార్నర్త్‌ రీజియన్‌–1), హిమాన్షి, కమలేశ్‌ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్‌గ్రిడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.శ్రీకాంత్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్‌ రీజియన్‌–1 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ శ్రీవాస్తవ, అలోక్‌ కుమార్‌ శర్మ (సీజీఎం–అసెట్‌ మేనేజ్‌మెంట్‌), సంజయ్‌ కుమార్‌ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్‌), హరినారాయణన్‌ (సీజీఎం–హ్యూమన్‌ రిసోర్సెస్‌) తదితరులు పాల్గొన్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)