Breaking News

గురుకుల టీచర్లకు త్వరలో పోస్టింగ్‌

Published on Sun, 06/23/2024 - 04:37

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల నుంచి దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన సుమారు 8,500 మంది అభ్యర్థులకు అతిత్వరలో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతు న్నారు. వచ్చే నెల మొదటి వారంలో వారంతా విధుల్లో చేరే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు లభించిన వారిలో ఎక్కువ మంది ఫిబ్రవరిలో నియామక పత్రాలు పొందగా... ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్‌ వచ్చిన నేపథ్యంలో మరికొందరికి నియా మక పత్రాల పంపిణీ నిలిచిపోవడం తెలిసిందే. 

తాజాగా ఎన్నికల కోడ్‌ ముగియడంతో పెండింగ్‌ అభ్యర్థులకు నియా మక పత్రాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు, మూడు రోజుల్లో వారికి నియామక పత్రాలు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సొసైటీ లు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నాయి. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్‌ విడుదల చేశారు. 

ఈ నెల 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కూడా ఆ సొసైటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీ లనకు శనివారం షెడ్యూల్‌ జారీ చేశారు. దీంతో మైనారిటీ, జనరల్, ఎస్సీ గురుకుల సొసైటీలు కూడా షెడ్యూల్‌ విడుదలకు సిద్ధమయ్యాయి. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. 

పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకే ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 7 నాటికి ఎస్సీ గురుకుల సొసైటీ పోస్టింగ్‌ ఆర్డర్లు విడుదల చేయనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి తెలిపారు. ఇతర గురుకుల సొసైటీలు సైతం అదే తరహా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)