Breaking News

బుకాయిస్తే తప్పు ఒప్పు కాదు

Published on Mon, 10/28/2024 - 05:34

సాక్షి, హైదరాబాద్‌: తాగి దొరికిన కేసులో బుకాయిస్తే తప్పు ఒప్పవుతుందని అను కోవడం పొరపాటని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. దొరికిన దొంగలు సమర్థించుకుంటూనే ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే పనిలో ఉండడం దారుణమని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌ జ్‌ ఘటనపై ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యా దు మేరకు పోలీసులు దాడి చేస్తే దొరికారని చెప్పా రు.

మాదకద్రవ్యాలు తీసుకోవడం తప్పుకాదనే ధోరణిలో బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా విమర్శ లు చేయడం సరికాదని అన్నారు. నిజంగా నిర్దోషు లయితే నిరూపించుకోవాలని హితవు పలికారు. ఈ కేసులో ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం ఉంద నడం బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, శాసనసభ్యుల అవివేకానికి నిదర్శమని పొన్నం వ్యాఖ్యానించారు. 

సమగ్ర విచారణ జరిపించాలి
జన్వాడ ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్‌పార్టీ, అనుమతి లేని మద్యం వినియోగం కేసులో సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌ చేయాలని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎం.ఎ.ఫహీమ్, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ ఎస్‌.శివసేనా రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ్రు శోభారాణి డిమాండ్‌ చేశారు. జన్వాడ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత, మహిళా ప్రతినిధులు సైబరాబాద్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)