రిజిస్ట్రేషన్‌ ఫీజు తగ్గిద్దామా?

Published on Sat, 07/06/2024 - 06:20

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజును ఒక శాతంమేర తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నివేదిక సమ ర్పించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫీజు తగ్గింపు అంశం చర్చకు వచ్చింది. ఎలాగూ భూముల «విలువలను సవరిస్తున్నందున సామాన్య ప్రజలపై భారం పడకుండా ఒక శాతం ఫీజు తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించినట్లు సమాచారం.

రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌లతో పాటు పలువురు డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు, భూముల విలువల సవరణ, కొత్త సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణం, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లా డుతూ సామాన్యుడిపై భారం పడకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించాలని, బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా ఈ సవరణ చేపట్టాలని సూచించారు.

వచ్చే వారంలోపు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సబ్‌రిజిస్ట్రార్లు పనిచేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే శాఖ పరిధిలో బదిలీలు జరగనున్నా యని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తా మని, బది లీల కోసం ఎవరూ తన వద్దకు రావ ద్దని, పైరవీలు చేసే వారిపై చర్యలు తీసుకుంటా నని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ఇక, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండే పరిస్థితులు ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని హంగులతో శాశ్వతంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు భవనాలు నిర్మించే ప్ర క్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.  

సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)