Breaking News

ధరణి లావాదేవీలపై ‘ఫోరెన్సిక్‌ ఆడిట్‌’

Published on Sat, 12/21/2024 - 06:02

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన భూముల లావాదేవీలపై ‘ఫోరెన్సిక్‌ ఆడిట్‌’నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టిన భూముల వివరాలను ఈ ఆడిటింగ్‌ ద్వారా కూలంకషంగా పరిశీలిస్తామని చెప్పారు. భూభారతి బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి.. ‘మాకు, బీఆర్‌ఎస్‌కు ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందన్నట్టు బీజేఎల్పీ నేత మాట్లాడుతున్నారు. మా నిజాయితీ, చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తాం. పదేళ్ల పాటు పేద ప్రజలను మోసం చేసి గుంజుకున్న ఆస్తులను, భూములను తిరిగి వారికి ఇప్పి స్తాం’అని వెల్లడించారు. ఆ తర్వాత కూడా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సరిపోదని, సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే సిట్టింగ్‌ జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమాలు తేలుతాయన్నారు. మంత్రి బదులిస్తూ ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌పై ప్రాథమిక నివేదిక వచి్చన తర్వాత ఏం చేయాలన్నది పరిశీలిస్తామని, సీఎంతో పాటు మంత్రిమండలిలో చర్చించి, స్పీకర్‌ అనుమతితో అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పారు.  

కేసీఆర్‌ టేబుల్‌పై ఆ పుస్తకం కనిపించేది.. 
ప్రముఖ న్యాయకోవిదుడు పడాల రామిరెడ్డి భూ సంస్కరణలపై రాసిన పుస్తకం ఎప్పుడూ కేసీఆర్‌ టేబుల్‌పై కనిపించేదని మంత్రి పొంగులేటి అంటూ, తన సెల్‌ ఫోన్‌లోని ఆ ఫొటోను ప్రదర్శించారు. అలాంటి పుస్తకాలు చదివిన ఆయన రూపొందించే ధరణి అద్భుతంగా ఉంటుందనుకున్నానని, కానీ ప్రజా కంటకంగా మారిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలు రోజుకో వేషం, రోజుకో డ్రామా వేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు.

స్పీకర్‌ పోడియంపైకి కాగితాలు, పుస్తకాలు విసిరివేయడం, బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు వేలు చూపిస్తూ బెదిరించడం లాంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా దాడి చేయాలనే ఉద్దేశంతో తన సీటు వద్దకు వచ్చి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బెదిరించారని పేర్కొన్నారు. ఈ దొరలను ప్రజలు రాష్ట్రంలో ఉండనీయబోరని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సభలో గూండాయిజం ప్రదర్శించిన వారిపై స్పీకర్‌ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  

కేసీఆర్‌ కాపలా కుక్క కాదు.. వేటకుక్క..
తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని ఉద్య మ సమయంలో కేసీఆర్‌ చెప్పారని, అయితే ఆయన వేటకుక్కలా రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూభారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్, ప్రతిపక్షంలోనూ అబద్ధాలతో కాలం గడపాలనుకుంటోంది. కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా, ప్రతిపక్ష నేత సభలో కనిపించరు.

అధికారంలో ఉన్నప్పటి తరహాలో నే ప్రతిపక్షంలో కూడా బీఆర్‌ఎస్‌ అరాచకంగా వ్యవహరిస్తోంది. ధరణితో లక్షల మంది ఇబ్బందికి గురికాగా, బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఎలాంటి సమస్యల్లేవని బుకాయించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన 73 ఏళ్ల మద్దెల కృష్ణయ్య అనే దళిత రైతు 35 ఏళ్ల క్రితం కొన్న ఏడెకరాల భూమి ధరణి పుణ్యాన వేరే వారి పేరిట మారటంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి’ అని పొంగులేటి ధ్వజమెత్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)