Breaking News

బీ ఫారం ఇస్తే సరి.. ఇవ్వకున్నా పోటీ!

Published on Tue, 02/03/2026 - 07:46

సాక్షి, సిటీబ్యూరో: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. బీ ఫారాల కోసం ఆయా పారీ్టల అధినేతలపై ఆశావహులు ఒత్తిడి తెస్తున్నారు. బుజ్జగింపులకు లొంగని వారు ఏకంగా తిరుగుబావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. బీ ఫారాలు ఇస్తారా.. లేదా? అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎలాగైనా అన్ని మున్సిపాలిటీల్లో గెలిచి తీరాలని అధికార కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సామాజిక, ఆరి్థక కోణాల్లో సర్వే చేపట్టి బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. మరోవైపు పార్టీ తరపున బీ ఫారాలు దక్కని వాళ్లు పక్క చూపులు చూస్తున్నారు. రాత్రికిరాత్రే పార్టీ మారేందుకు వీరిలో కొంత మంది సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

అన్ని పారీ్టల్లోనూ రెబల్స్‌ బెడద 
రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 126 వార్డులకు అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి 962 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున 348 మంది నామినేషన్‌ వేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 280 మంది, బీజేపీ నుంచి 195 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎంఐఎం, సీపీఐ, సీపీఐఎం, సమాజ్‌వాది, ఇతర జాతీయ పారీ్టల నుంచి మరో 139 నామినేషన్లు అందాయి. పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. ఏ ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. అధికార, ప్రతిపక్ష పారీ్టల్లో ఆశావహుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. పార్టీ తరఫున బీ ఫారాల కోసం ఎవరికి వారు ఫైరవీలు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల్లోగా రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాల్సి ఉండడంతో పార్టీ ఇన్‌చార్జిలపై ఒత్తిడి తెస్తున్నారు.  

మేడ్చల్‌లోనూ సేమ్‌ సీన్‌ 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. టికెట్‌ రాదని భావిస్తున్న వారంతా రెబెల్స్‌గా మారాలని యతి్నస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మూడు మున్సిపాలిటీల్లో 68 వార్డులకు సంబంధించి పోటీ అధికంగా ఉండటంతో రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో పార్టీ ముఖ్యులు నిమగ్నమయ్యారు. మూడు పురపాలికల పరిధిలో మొత్తంగా 545 మంది పోటీ పడుతుండగా.. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచే 414 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. చాలా చోట్ల ముఖ్య నాయకుల ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)