Breaking News

బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Published on Sun, 04/27/2025 - 08:19

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): నైజీరియా నుంచి డ్రగ్స్‌ను కొనుగోలుచేస్తూ గోవాతో పాటు ముంబయ్, హైదరాబాద్‌లలో విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్‌ పెడ్లర్‌తో పాటు సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గోవాకు చెందిన  లివియో జోసఫ్‌ అల్మిడా అలియాస్‌ ప్యూషా (41) గోవాకు తరచూ పర్యాటకులుగా వచ్చే నైజీరియన్లతో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్రగ్స్‌ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని, నైజీరియా నుంచి తాము దిగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నైజీరియా నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేసుకుంటూ విక్రయిస్తున్న జోసఫ్‌ కదలికలపై నగర పోలీసులు దృష్టిసారించారు.

 బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–2లోని కమలాపురికాలనీ ప్రాంతంలో జోసఫ్‌ ఓ వ్యక్తికి కొకైన్‌ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి 11 గ్రాములు ఎండీఎంఏ, 10 గ్రాముల కొకైన్, రూ.1.97 లక్షల నగదు, ఒక బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. గోవా నుంచి మూడు రోజుల క్రితం జోసఫ్‌ హైదరాబాద్‌కు రాగా ఇక్కడ ఓ వ్యక్తి ఆశ్రయమిస్తున్నట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–2లోని ఇందిరానగర్‌లో నివసించే ఉబలంక శంకర్‌ (48) అనే వ్యక్తి షెల్టర్‌ ఇవ్వడమే కాకుండా బైక్‌ కూడా సమకూర్చి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. 

ఆయనను కూడా బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కూడా జోసఫ్‌ హైదరాబాద్‌లోనే డ్రగ్స్‌ విక్రయిస్తుండగా అప్పుడు కూడా వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పలువురికి డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నగరంలో ప్రతి నెలా రెండు సార్లు సంజయ్, లోకేష్‌  సతీష్‌వర్మ, అమిత్, సిద్దార్ధ, రుద్రరాజు తదితర కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. 

హైదరాబాద్‌కు వచ్చినప్పడల్లా పాత కేసులో భాగంగా కోర్టుకు హాజరవుతూ వచ్చేటప్పుడే గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకువస్తూ తెలిసిన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది.  గోవా నుంచి హైదరాబాద్‌కు రావడానికి బస్సులోనే వస్తుంటాడని, బస్సులో అయితే ఎలాంటి చెకింగ్‌లు ఉండవన్న ఉద్దేశ్యంతో తన మాజీ భార్యతో టికెట్‌ బుక్‌ చేయిస్తుంటాడని తేలింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)