Breaking News

బార్‌లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు

Published on Thu, 01/09/2025 - 08:16

సనత్‌నగర్‌: యువతులను ఎరగా వేసి..మందుబాబులకు కిక్కు పెంచి..అధిక బిల్లులు బాదుతున్న ఓ బార్‌  దోపిడీకి ఎస్‌ఓటీ పోలీసులు అడ్డుకట్ట వేశారు. 11 మంది యువతులతో పాటు 10 మంది బార్‌ సిబ్బంది, మందు బాబులను అదుపులోకి తీసుకుని సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 

వివరాల్లోకి వెళితే.. మూసాపేట లక్ష్మీకళ థియేటర్‌ సమీపంలోని ఎవర్‌గ్రీన్‌ ఫ్యామిలీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు కొంతమంది యువతులను ప్రత్యేకంగా నియమించుకుని..వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న మందు బాబుల వద్ద అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. 

ఎటువంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యకలాపాలకు  అనుమతులు లేకున్నా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 11 మంది యువతులను, 10 మంది బార్‌ సిబ్బంది, మద్యం ప్రియులను అదుపులోకి తీసుకున్నారు. బార్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)