Breaking News

పద..పదమంటూ ‘పోచారం’

Published on Fri, 01/17/2025 - 05:03

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆయన డెబ్బై ఆరేళ్ల వయస్సులో కూడా నవ యువకుడిగా తిరుగుతూనే ఉంటారు. అడవి అయినా, గుట్ట, పుట్ట ఎక్కడికైనా సరే చలో అంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాదు... పనులు పూర్తయ్యే దాకా కాంట్రాక్టర్ల వెంట పడతారు. తనే స్వయంగా ఆ పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఆయనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి. మంత్రిగా స్పీకర్‌గా మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఒకే రకమైన టెంపో కొనసాగిస్తున్నారు. 

అభివృద్ధి పనులకు నిధులు సాధించి వాటిని పూర్తి చేసేదాకా వెంటపడతారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో రూ.10 వేల కోట్లు తీసుకొచ్చాడని చెబుతారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 10 వేలకు పైగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించడంలో ఆయన కృషి ఎంతో ఉందంటారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును ఆయన ఎన్నోసార్లు పర్యవేక్షించారు. రోడ్లు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, స్కూల్‌ భవనాలు... ఇలా ఏ పని అయినా సరే తను వెళ్లాల్సిందే. 

నియోజకవర్గ పరిధిలోని సిద్దాపూర్‌ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆయన ప్రతి నెలలో ఒకటి రెండుసార్లు పరిశీలించారు. ఎంతదూరమైనా సరే, ఎంత లోపలకు ఉన్నా సరే వెళతారు. ఒకవేళ రోడ్డు మార్గం సరిగ్గా లేదని కార్లు వెళ్లే పరిస్థితి లేదంటే బైక్‌ మీద కూడా వెళ్లి వస్తారు. బాన్సువాడ పట్టణంలో జరిగే పనులను రెగ్యులర్‌గా పరిశీలిస్తారు. జోరువర్షం కురుస్తుందని అందరూ ఇళ్లలో ఉంటే తను మాత్రం బ్యాటరీ వాహనంలో ఊరంతా చుట్టేస్తారు. 

నీరు నిలిచిపోకుండా నాలాలను శుభ్రం చేయించమని ఆదేశిస్తారు. కాంట్రాక్టర్లు పనులు ఆపితే కారణాలు తెలుసుకొని బిల్లుల సమస్య అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు ఇప్పించి వారికి సహకరిస్తుంటారు. దీంతో అందరూ పోచారం స్టైలే వేరబ్బా అంటుంటారు. పెద్దాయనతో పోటీపడలేమని ఇతర ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)