Breaking News

కుక్క దొరికిందని ఠాణా మెట్లెక్కారు!

Published on Sat, 02/08/2025 - 09:33

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో నివసించే 21 ఏళ్ల సంవీత్‌.. తన స్నేహితులైన గౌతమ్, దీక్షిత్, తరుణ్, ధనుష్‌లతో కలిసి మంగళవారం రాత్రి కారులో వెళ్తున్న సమయంలో మాదాపూర్‌లోని బజాజ్‌ ఎ్రక్టానిక్స్‌ ఎదుట సలూకి జాతికి చెందిన పెంపుడు శునకం కనిపించింది. దాని యజమానిని గుర్తించేందుకు వారంతా ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో చివరికి మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. శునకానికి తాడు కొని దానిని గౌతమ్‌ ఇంటికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు.

 శునకం యజమానిని కనుగొనేందుకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతుకుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ సదరు కుక్కను గుర్తు పట్టి సమీపంలో చూశానని చెప్పారు. దీంతో యజమానిని గుర్తించేందుకు చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్లను తట్టారు. ఈ క్రమంలోనే ఓ ఇంటి వాచ్‌మన్‌ ఈ కుక్కను గుర్తించాడు. అంతకు కొన్ని గంటల ముందే కుక్క యజమాని వెతుక్కుంటూ వచ్చాడని, అతని సెల్‌ నంబర్‌ ఇచ్చాడు. దీంతో జూబ్లీహిల్స్‌కు చెందిన ఆ యజమానికి కుక్కను అప్పగించారు.

బ్లేజ్‌ పేరుతో పిలుచుకునే ఈ కుక్క కనిపించగానే యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పోలీసులు యువకులను అభినందించారు. కాగా.. తనకు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, తన స్నేహితుడు గౌతంకు ఆరు కుక్కలు ఉన్నాయని.. వాటితో ఉండే అనుబంధం వేరుగా ఉంటుందని సంవీత్‌ తెలిపారు. అందుకే రెండు రోజుల పాటు కుక్క యజమానిని గుర్తించేందుకు గల్లీ గల్లీ జల్లెడ పట్టామన్నారు. అప్పగించిన కుక్క ఖరీదు దాదాపు రూ.2  లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని.. అందుకే ఎంత కష్టమైనా దాని యజమానిని గుర్తించి అప్పగించామన్నారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)