Breaking News

తాజా కాదు.. ఈజీ ఫుడ్డుకే జై

Published on Thu, 02/13/2025 - 04:31

సాక్షి, హైదరాబాద్‌:  అధిక పోషకాలుండే తాజా ఆహార పదార్థాల కంటే సులభంగా అందుబాటులో ఉండే నిలువ ఉండే ఆహారంపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆహారానికి చేస్తున్న ఖర్చులో.. ప్రాసెస్డ్‌ ఆహారానికి సంబంధించిన వ్యయమే ఎక్కువగా ఉంటోంది. దేశ వ్యాప్తంగా ప్రాసెస్డ్‌ ఆహారంపైన చేస్తున్న ఖర్చు 24.44 శాతం ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే– 2023–24’ స్పష్టం చేస్తోంది. 

గ్రామీణ ప్రాంత ప్రజలు 20.93 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంత ప్రజలు 27.95 శాతం ఖర్చు పెడుతున్నారు. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వినియోగంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉన్నప్పటికీ... వినియోగం మాత్రం వేగంగా పెరుగుతూ వస్తోంది.  

ఆధునిక జీవనశైలికిఅనుగుణంగా.. 
ఆధునిక జీవనశైలికి అనుగుణంగాఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు,విద్యార్థులు వారి రోజువారీ కార్యకలాపాల్లో బిజీ ఉంటూ వెంటనే అందుబాటులో ఉండే (అత్యవసర ఆహారం) నిల్వ ఉండే, శుద్ధి చేసి భద్రపర్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. 

ఈ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగాఉండకపోవడం, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా ఉపయోగించే రసాయనాల కారణంగా అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్‌లు, చిరుతిళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది కాదని అంటున్నారు.

పాలు, పండ్లను మించి ఖర్చు 
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ వినియోగ వ్యయ సర్వేలో ఆహారంపై చేసే ఖర్చును ఏడు కేటగిరీల్లో లెక్కించారు. తృణధాన్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు తదితర ఈ ఏడు కేటగిరీల్లోనూ ప్రాసెస్డ్‌ ఆహారం, బేవరేజెస్‌ (పానీయాలు) ఖర్చే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. 

తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాహారాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నంగా ప్రాసెస్డ్‌ ఆహారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, కూరగాయలకు ప్రాధాన్యత తక్కువగా ఉంది. 

ఇక్కడ ఈ సరుకులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండగా, తాజా సరుకుల లభ్యత కష్టంగా ఉండడంతో వీటి వినియోగానికి ప్రాధాన్యత తగ్గుతోంది. మరోవైపు హోటళ్లు, కర్రీ పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూరగాయల కొనుగోలుపై ప్రభావం చూపుతోంది. 

రాష్ట్రాల్లో తమిళనాడు టాప్‌
ప్రాసెస్డ్‌ ఫుడ్, పానీయాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో (పట్టణ ప్రాంతం) తమిళనాడు (34.30 శాతం) మొదటి వరుసలో ఉంది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ, కర్ణాటక, అసోం, పంజాబ్‌ రాష్ట్రాలున్నాయి. గ్రామీణ ప్రాంత కేటగిరీలోనూతమిళనాడు (29.89 శాతం)ముందుండగా.. అసోం, కర్ణాటక, పంజాబ్, రాజస్తాన్, ఒడిశా, గుజరాత్‌ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 10వ స్థానంలో ఉంది. 

రాష్ట్రంలో జాతీయ సగటును మించి.. 
రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఆహారం కోసం చేస్తున్న వ్యయంలో ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కోసమే 27.23 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే 2.79 శాతం అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మొత్తం ఆహారంలో ప్రాసెస్డ్‌ ఆహారంపై 20.84 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది ఏకంగా 33.63 శాతంతో దేశంలో రెండో స్థానంలో ఉంది. 

దేశ సగటుతో పోలిస్తే మన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్‌ ఆహారంపైన చేస్తున్న ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పట్టణ ప్రాంతంలో ఆందోళనకర స్థాయిలో ఉండడం గమనార్హం.   

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)