Breaking News

గర్భ విచ్ఛిత్తికి ఆర్‌ఎంపీల ప్రోత్సాహం

Published on Mon, 11/04/2024 - 04:35

ఎంజీఎం: ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా హనుమకొండ జీఎంహెచ్‌ ఆస్పత్రి నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు నరేష్, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్‌ ఆదివారం విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భిణి అక్టోబర్‌ 3న మంగపేటకు చెందిన ఆర్‌ఎంపీ రామును కలవగా, గర్భ విచ్ఛిత్తికి మందులు ఇచ్చాడు. 

కడుపు నొప్పి రావడంతో మరిన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా.. కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ నొప్పి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఈనెల 1న హనుమకొండ జీఎంహెచ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గర్భాశయం పగలడంతోపాటు శరీరంలోని రక్తం విషతుల్యమైందని నిర్ధారించారు. 

గర్భసంచి తొలగించి వెంటిలేటర్‌ చికిత్స అందించడానికి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుల తనిఖీ బృందం గుర్తించింది. ఈ ఘటనపై ములుగు జిల్లా వైదారోగ్యశాఖ అధికారులు, పోలీసులకు సదరు ఆర్‌ఎంపీపై ఫిర్యాదు చేయనున్నట్టు కౌన్సిల్‌ సభ్యులు తెలిపారు.

సిద్దిపేట జిల్లా అక్కంపేట మండలానికి చెందిన మరో గర్భిణికి సైతం కేశవపూర్‌కు చెందిన రమణాచారి అనే నకిలీ వైద్యుడు గర్భ విచ్ఛిత్తికి మందులు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయస్థితికి చేరుకుందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడిన వైద్యులు టీజీఎంసీ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అతడిపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.

ములుగులో మెడికల్‌ స్టోర్‌ యజమాని సొంత వైద్యం 
ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన మరో గర్భిణికి జిల్లా కేంద్రం బస్టాండ్‌ సమీపాన ఉన్న మెడికల్‌ స్టోర్‌ యజమాని ఇచ్చిన గర్భ విచ్ఛిత్తి మందులు వేసుకున్నాక..ఆమె స్పృహ కోల్పోవడంతో హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కౌన్సిల్‌ సభ్యులు తెలిపారు. వైద్యులు సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.

బాధిత మహిళ షాపు పేరు చెప్పకపోవడంతో ములుగు జిల్లా బస్టాండ్‌ ప్రాంతంలో అన్ని మందుల దుకాణాలను తనిఖీ చేసి సదరు మెడికల్‌ స్టోర్‌లపై చర్యలు తీసుకోవాలని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)