Breaking News

వచ్చే నెల 5 తర్వాత ‘స్థానికం’పై స్పష్టత

Published on Fri, 01/31/2025 - 01:06

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కులగణన జరగకుండా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయవంతంగా పూర్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. కులగణనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ఫిబ్రవరి 5న కేబినెట్‌ ముందు పెడుతుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. 

దానిని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుందని వివరించారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ గురువారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్సార్‌కు ఉన్నంత అభిమానులు ఎవరికీ లేరని చెప్పారు. 

స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగరవేస్తాం 
కులగణన నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని.. దీనిపై ఫిబ్రవరి 5 తర్వాత స్పష్టత వస్తుందని మహేశ్‌గౌడ్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. 

‘‘గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లతో అధిష్టానానికి నివేదిక ఇచ్చాం. రెండు మూడు రోజుల్లో కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తాం. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ బలోపేతం కోసం జీహెచ్‌ఎంసీపై ప్రత్యేక దృష్టి పెట్టాం.

జీహెచ్‌ఎంసీలో అత్యధిక సీట్లు గెలిచి మేయర్‌ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’’అని చెప్పారు. సమయాభా వం వల్ల ముఖ్యమంత్రి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, సీఎం నివాసంలో సమీక్షలు చేస్తున్నారని.. అందులో తప్పేముందని పేర్కొన్నారు.  

సూర్యాపేటలో రాహుల్‌ సభ
ఫిబ్రవరి 2వ వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్‌ గాంధీ సభ నిర్వహించబోతున్నామని మహేశ్‌గౌడ్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అధికారిక నివాసంలో సీఎం ఫోటోతోపాటు రాహుల్, సోనియా గాంధీ, ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని సూచిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుండి అభివృద్ధి కోసం తెచ్చిన నిధులు ఎన్ని అని ప్రశ్నించారు. 

బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన పేరుతో డ్రామాలు చేస్తుండటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనే రియ ల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని.. దానిని తమ ప్రభుత్వం గాడిన పెడు తోందని చెప్పారు. ఫాంహౌస్‌ పాలన కోరుకునేది దొరలు మాత్రమేనని, ప్రజలంతా ప్రజాపాలనే కోరుకుంటారని పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)