Breaking News

‘ఎలాగైనా మా కొడుకును గాడిలో పెట్టండి.. మీరేం చేస్తారో చేయండి’

Published on Tue, 09/27/2022 - 08:35

సాక్షి, నల్గొండ: ముగ్గురు ఆడ­పిల్లల మధ్య ఒక్కగానొక్క కుమారుడు.. ఎంతో గారాబంగా పెరిగిన ఆ కొడుకు జులాయిగా మారి దొంగతనాలకు అలవాటు­పడి.. చివరికి అమ్మానాన్నలపైనే తిరగబడే పరిస్థితి రావడంతో కౌన్సెలింగ్‌ ఇవ్వాలని పోలీ­సులను ఆశ్రయించాల్సిన దుస్థితి.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలోని దినసరి కూలీకి చెందిన కుటుంబం నల్లగొండ పట్టణంలోని బోయవాడలో బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటోంది. నలుగురు సంతానంలో ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా మరో కుమార్తె డిగ్రీ చదువుతోంది.. కానీ ఒక్కగా­నొక్క కుమారుడు మాత్రం పదోతరగతి తర్వాత చదవనని మొండికేశాడు.

మద్యానికి బానిసయి ఆటో డ్రైవర్‌గా పనిచేయడం, సెల్‌ఫోన్లు చోరీ చేయడం, పక్క నివాసాల్లో చోరీలకు పాల్పడటంతో.. విషయం తెలిసిన తల్లిదండ్రులు పరువుపోయిందని తల్లడిల్లి చివరికి చేసేది లేక పోలీసులనే ఆశ్రయించారు. ఎలా­గైనా మా కుమారున్ని గాడిలో పెట్టండి. నాలుగు తగిలిస్తారో.. మీ స్టేషన్‌­లోనే ఉంచుతారో.. మీ ఇష్టం. తల్లిదండ్రులు అనే గౌరవం లేకుండా  దూషిస్తు­న్నాడు. దొంగతనం ఎందుకు చేశావని నిలదీశాం. తప్పు పనులు చేయవద్దని కొడితే తిరిగి మాపై చేయి చేసుకుంటున్నాడు’’ అని పోలీసు స్టేషన్‌లో కన్నీరు­మున్నీరయ్యారు.  

‘మీరేం చేస్తారో... చేయండి.  మా కుమారుడిని గాడిలో పెట్టేంతవరకు జైల్‌లో ఉంచండి’ అని ఆ బాలుని తల్లిదండ్రులు ఎస్‌ఐ  రాజశేఖర్‌రెడ్డి వద్ద ప్రాధేయపడ్డారు. ఎస్సై కౌన్సెలింగ్‌ అనంతరం కూడా.  ఆ బాలున్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యు­లు తొలుత అంగీకరించలేదు. దీంతో బాలుడిలో మార్పు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ ఇస్తామని, ప్రతిరోజూ ఉదయం స్టేషన్‌కు తీసుకురావాలని బాలుడి తల్లిదండ్రులకు చెప్పి పంపించినట్టు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

#

Tags : 1

Videos

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)