Breaking News

అడ‌వి అలుగు పెంకు కోటిన్న‌రా..? అంతా అబ‌ద్ధం

Published on Sat, 12/28/2024 - 17:13

ఏటూరునాగారం: అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉన్న అడవి అలుగు (ఇండియన్‌ పాంగోలిన్‌)కు అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.5 కోట్ల ధర ఉందన్న ప్రచారం అంతా అబద్ధమని ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు కొట్టిపారేశారు. కొందరు జంతు స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. అరుదైన ఈ జంతువును వేటాడినా, స్మగ్లింగ్‌ చేసినా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

వేటగాళ్లకు ఆశచూపి..
భూపాలపల్లికి చెందిన చిదం రవి అనే వ్యక్తి ఇటీవల అడవి అలుగుకు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.5 కోట్ల ధర పలుకుతుందని, చైనాలో మందుల తయారీలో దీని పెంకులు వాడుతారని ప్రచారం చేశాడు. అడవి అలుగును వేటాడి తీసుకొస్తే భారీగా డబ్బు ఇస్తానని భూపతిపూర్‌కు చెందిన కోరం నాగయ్య, కోరం పెంటయ్య, కోరం కృష్ణమూర్తి అనే వేటగాళ్లకు ఆశ చూపాడు. దీంతో భూపతిపూర్‌ అడవుల్లో ఆ జంతువును పట్టుకొన్న వారు.. రవికి అందజేశారు. ఈ నెల 20వ తేదీన దానిని భూపాలపల్లికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఏటూరునాగారం నార్త్‌ అటవీశాఖ అధికారులు పట్టుకొన్నారు. అడవి ఎలుగుతో చిదం రవి పట్టుబడ్డాడు.  

జీవితకాలం 20 ఏళ్లు  
అంతరించిపోతున్న అరుదైన జీవి ఇండియన్‌ పాంగోలిన్‌. దీని జీవితకాలం 20 ఏళ్లు. సింహం కూడా తినలేనంత గట్టిగా అలుగు పెంకులు ఉంటాయి. అత్యధిక వర్షపాతం, పురుగులు, చీమల పుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇవి జీవిస్తుంటాయి. ఎడారి అడవుల్లోనూ ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ జంతువు పెంకులను చైనాలో మందుల తయారీలో వాడుతారని స్మగ్లర్లు ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యవర్తులకు భారీ ధరకు విక్రయిస్తున్నారు.  

అలుగు పెంకులు ఏ మందుల్లోనూ వాడరు 
అడవి అలుగు పెంకులను ఎలాంటి మందుల తయారీకి వాడరు. అదంతా అపోహ మాత్రమే. స్మగ్లర్లు సొమ్ము చేసుకునేందుకే అమాయకులకు ఇలా మాయమాటలు చెబుతున్నారు. 
– అబ్దుల్‌ రెహమాన్, సౌత్‌ రేంజ్‌ అధికారి, ఏటూరునాగారం.

చ‌ద‌వండి: కోతుల‌తో భ‌యం.. కొండ‌ముచ్చుల‌తో ఉపాయం  

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)