Breaking News

ప్రజెంట్‌ సార్‌... అర్ధనగ్నంగా సెల్ఫీ దిగి..

Published on Sat, 08/02/2025 - 08:07

తంగళ్లపల్లి(సిరిసిల్ల):  పంచాయతీ కార్యదర్శులు నిత్యం డీఎస్‌ఆర్‌ యాప్‌లో సెల్ఫీ దిగి తమ హాజరును నమోదు చేయాలి. అనంతరం గ్రామంలో చేపట్టే పనుల ఫొటోలు పోస్టు చేయాలి. కానీ తంగళ్లపల్లి, సారంపల్లి గ్రామాల కార్యదర్శి మహ్మద్‌ సమీర్‌ జూలై 29, 30 తేదీలలో ఒంటిపై బట్టలు లేకుండా.. తన ఇంటిలోనే సెల్ఫీ దిగి హాజరు పూర్తిచేసినట్లు గుర్తించారు. దీనిపై తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను ‘సాక్షి’వివరణ కోరగా.. పంచాయతీ కార్యదర్శుల డీఎస్‌ఆర్‌ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇలాంటివి జరిగినట్లు గుర్తిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.

 సీఎం ఫొటోతో హాజరు
పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేసిన జగిత్యాల కలెక్టర్‌
బుగ్గారం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోతో ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదుపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు.. ఇటీవల ప్రత్యేక పరిశీలన జరిపారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ హాజరు నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలింది. చంద్రయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.రాజన్న ఏకంగా ముఖ్యమంత్రి ఫొటోనే వాడి డీఎస్‌ఆర్‌ (డైలీ శానిటేషన్‌ రిపోర్ట్‌)యాప్‌లో హాజరు నమోదు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల పరిశీలనలో విషయం బయటపడడంతో.. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ కార్యదర్శి రాజన్నను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై బుగ్గారం ఎంపీడీవో అఫ్జల్‌మియాను వివరణ కోరగా.. హాజరు నమోదుకు సంబంధించి కారోబార్‌ చేసిన పొరపాటుతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు.   

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)