Breaking News

అదరగొడుతున్న ఆఫ్‌ క్యాంపస్‌

Published on Wed, 10/22/2025 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ ఉద్యోగ నియామకాల ట్రెండ్‌ మారింది. క్యాంపస్‌ నియామకాలకన్నా ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఐటీ దిగ్గజాలన్నీ దీనికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు తగ్గట్టు మానవ వనరుల సమీకరణకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మారడం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దూకుడుగా వెళ్తుండటంతో స్కిల్‌ ఉన్న వారికే కంపెనీలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి నగరాల్లో గత మూడేళ్లుగా 78 శాతం ఏఐ, డేటాసైన్స్‌లో నైపుణ్యం ఉన్న వారినే కంపెనీలు ఎంపిక చేసుకున్నట్లు నౌకరీ డాట్‌ కామ్‌ అధ్యయనంలో తేలింది. 

ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో 84 శాతం నియామకాలు ఆఫ్‌ క్యాంపస్‌ (off-campus) ద్వారానే చేపట్టినట్లు డెలాయిట్‌ సంస్థకు చెందిన సీనియర్‌ హెచ్‌ఆర్‌ ఒకరు తెలిపారు. వేతనాలు కూడా క్యాంపస్‌ నియామకాలకన్నా ఆఫ్‌ క్యాంపస్‌ ద్వారా నియమించుకున్న వారికే ఎక్కువ ఇస్తున్నారు. డెలాయిట్‌ ఇండియా నివేదిక ప్రకారం ఈ ఏడాది క్యాంపస్‌ నియామకాల్లో వేతనాలు 3.91 శాతం పెరిగితే ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల్లో 15 శాతం వార్షిక వేతన ప్యాకేజీ పెరిగింది. యాన్‌ ఇండియా క్యాంపస్‌ స్టడీ 2025–26 ప్రకారం 73 శాతం సాధారణ కంపెనీలే క్యాంపస్‌ నియామకాలు చేపట్టాయి. ఐటీ దిగ్గజ సంస్థల్లో 85 శాతం కంపెనీలు ఆఫ్‌ క్యాంపస్‌ ద్వారానే నియామకాలు చేశాయి. 

కారణాలేంటి? 
ఐటీ రంగంలో అనుభవం ఉంటే తప్ప ఉద్యోగులను తీసుకొనే పరిస్థితి లేదు. కానీ క్యాంపస్‌ నియామకాల్లో ఫ్రెషర్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉన్నందున కాలేజీల్లో కాకుండా ఇతర సంస్థల్లో, ఆన్‌లైన్‌ విధానంలో కోడింగ్‌పై (Coding) పట్టు సాధించిన వారిని నియమించుకోవడంపై కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. ఇంకో ప్రధానాంశం ఏమిటంటే క్యాంపస్‌ నియామకాల్లో కేవలం కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం మాత్రమే ఇంటర్వ్యూ చేస్తోంది. అదే ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో అయితే ఆన్‌లైన్‌ ద్వారా వివిధ స్థాయిల నిపుణులు అభ్యర్థిని లోతుగా ప్రశ్నించే వీలుంది. దీనివల్ల నైపుణ్యం ఉన్న వారినే ఎంపిక చేసుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. 
 
ఆఫ్‌ క్యాంపస్‌లో రాణించాలంటే.... 
నైపుణ్యం ఉన్నప్పటికీ ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో చాలా మంది ఎంపిక కావడం లేదు. పెద్ద ఐటీ సంస్థలు దాదాపు ఆరు రౌండ్ల దాకా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది అభ్యర్థులు ధైర్యంగా మాట్లాడలేక, బెరుకుగా సమాధానాలు ఇస్తుండటం వల్ల తొలి రౌండ్‌లోనే నిష్క్ర‌మిస్తున్నారని ఐబీఎం హెచ్‌ఆర్‌ సీనియర్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు. 

రెజ్యూమ్‌ రూపకల్పనలోనూ తప్పులు చేస్తున్నారని.. అనుభవానికి మించి ఎక్కువ కేడర్‌ పోస్టులకు దరఖాస్తు చేస్తుండటం వల్ల తొలి దశలోనే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోందని పేర్కొన్నారు. అలాగే నైపుణ్యం ఉన్నా సరైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడం వల్ల కూడా కొందరు అభ్యర్థులు విఫలమవుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ నైపుణ్యాలను ఆన్‌లైన్‌ వేదికల ద్వారా నేర్చుకోవచ్చని.. తద్వారా ఆప్‌ క్యాంపస్‌ కొలువులు సాధించడం కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. 

ఐటీ నియామకాల్లో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌ ద్వారానే కనెక్ట్‌ అవుతున్నాం. ఇది తేలికగా ఉంటోంది. అభ్యర్థి సామర్థ్యాన్ని గుర్తించడానికి వివిధ కేటగిరీ నిపుణులూ ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి వస్తారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఇది సాధ్యం కాదు. అందుకే గత మూడేళ్లలో పెద్ద కంపెనీలు 70 శాతం మేర ఆఫ్‌ క్యాంపస్‌ సెలక్షన్స్‌ వైపు మళ్లాయి. 
– అంబరీష్‌ నికోలన్‌ (ఓ ఎంఎన్‌సీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌) 

సమర్థతకు ఇదే వేదిక 
ఫైనలియర్‌లో క్యాంపస్‌ నియామకాల కోసం పెద్ద కంపెనీలేవీ రాలేదు. ఆశించిన వేతన ప్యాకేజీ ఇవ్వలేదు. దీంతో కొన్ని కోర్సులు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా నేర్చుకున్నా. ఆఫ్‌ క్యాంపస్‌ సెలక్షన్స్‌కు ప్రయత్నించి ఓ ఎంఎన్‌సీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సాధించా. మన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఇదే సరైన మార్గం. 
– సంజయ్‌ త్రిపూర్‌ (బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్‌) 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)