Breaking News

రింగ్‌ రైలు @ రూ. 28 వేల కోట్లు

Published on Wed, 08/27/2025 - 05:38

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డును ఆనుకొని నిర్మించాలని భావిస్తున్న ఔటర్‌ రింగ్‌ రైల్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. తొలుత రూ. 12,408 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన రైల్వేశాఖ తాజాగా దాన్ని రూ. 28 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేస్తూ కొత్త నివేదికను సిద్ధం చేసింది. ఇందుకోసం కొత్తగా 60 మీటర్ల వెడల్పుతో 3,600 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. 

రింగు రోడ్డు కంటే మీటరున్నర ఎత్తుతో నిర్మాణం... 
రీజినల్‌ రింగురోడ్డును 5 మీటర్ల ఎత్తుతో నిర్మించనుండగా దానికి బయటి వైపు ఔటర్‌ రింగురైలును మరో మీటరున్నర ఎత్తుతో నిర్మించనున్నారు. అంటే భూమి నుంచి ఆరున్నర మీటర్ల ఎత్తుతో రైల్వే లైన్‌ నిర్మిస్తారన్నమాట. ఒకేసారి రెండు లైన్ల నిర్మాణం చేపడతారు. భవిష్యత్తులో అవసరమైతే లైన్ల సంఖ్య పెంచేలా కొంత భూమిని వదలాలని భావిస్తున్నారు. ఇందుకోసం 60 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయనున్నారు. 

ఇంత ఎత్తుతో కట్ట నిర్మించాలంటే పైనుంచి భూమి వైపు వచ్చేకొద్దీ అది వాలుగా ఉంటుంది. అంటే పైన ట్రాక్‌ నిర్మించే భాగం కంటే, కింద భూమి వద్ద అలైన్‌మెంట్‌ పరిధి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రెండు లైన్ల ట్రాక్‌ నిర్మాణానికి 15 మీటర్ల స్థలం అవసరం. దాని వాలుతో కలుపుకొంటే 45 మీటర్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అదనంగా మరో లైన్‌ నిర్మించేంత స్థలం కావాలంటే 60 మీటర్ల వెడల్పుతో స్థలాన్ని సేకరించాలని భావిస్తున్నారు. 

ఇంటర్‌ ఛేంజ్‌ లైన్లుగా రైల్‌ వంతెనలు... 
ఔటర్‌ రింగు రైలు ఆరు ప్రాంతాల్లో వివిధ మార్గాల నుంచి వచ్చే రైల్వే లైన్లను క్రాస్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరు చోట్ల రైల్‌ ఓవర్‌ రైల్‌ వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ వంతెనలు ఇంటర్‌ ఛేంజ్‌ లైన్లుగా ఉంటాయి. అంటే ఆ ఆరు లైన్ల నుంచి ఔటర్‌ రింగ్‌ రైలు అనుసంధానం అవుతుంది. అటూఇటూ రైళ్లు మారేలా ఉంటాయి. 

అందుకోసం క్రాసింగ్‌కు ఐదు కి.మీ. దూరం నుంచి మెట్రో రైలు తరహాలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. అలాగే 26 నుంచి 30 కొత్త స్టేషన్లను కూడా నిర్మించాల్సి ఉంది. రింగురోడ్డు ఉన్నందున స్టేషన్‌ భవనాలను కూడా మెట్రో రైలు తరహాలోనే నిర్మించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లు త్వరలో సిద్ధం చేయనున్నారు. 

రోజువారీ ప్రయాణికుల సంఖ్య 9 లక్షలకు పెరిగే అవకాశం 
ప్రస్తుతం హైదరాబాద్‌–ఇతర ప్రాంతాల మధ్య నిత్యం రైళ్ల ద్వారా 4 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఔటర రింగ్‌ రైల్‌ అందుబాటులోకి వచ్చిన ఐదారేళ్లలో ఆ సంఖ్య 9 లక్షలకు చేరుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. 

అదనపు రూట్‌ అందుబాటులోకి రావడం, పరస్పర లైన్ల అనుసంధానం వల్ల రైళ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మీదుగా నిత్యం 130 సరుకు రవాణా రైళ్లు తిరుగుతుండగా ఔటర్‌ రింగ్‌ రైలు వచ్చాక ఐదారేళ్ల కాలంలో ఆ సంఖ్య 250కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)