Breaking News

ఫిలిప్పీన్స్‌కు మన బియ్యం

Published on Sun, 10/06/2024 - 04:22

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌ దేశానికి పంపించే ప్రక్రియకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలి అడుగు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి ఏటా సగటున 70 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో రాష్ట్ర అవసరాలకు 24 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం వినియోగించుకొంటుండగా, మిగతా మొత్తాన్ని ఎఫ్‌సీఐకి లెవీ కింద పెడుతున్నారు. 

కాగా ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో నాణ్యమైన సన్నబియ్యం ఉత్పత్తి పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో నేరుగా విదేశీ ఎగుమతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. నాణ్యతా కారణాల వల్ల ఫిలిప్పియన్లు గత కొన్నేళ్లుగా భారతదేశం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులపై ఆ దేశ వ్యవసాయ మంత్రి రోజేర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

ఫిలిప్పీన్‌లకు ప్రతి సీజన్‌లో 3 టన్నుల వరకు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు. ఇద్దరు మంత్రుల చర్చలు స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో సాగాయి. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడినందున ఎగుమతి కోసం ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు మంత్రి ఉత్తమ్‌‘సాక్షి’కి తెలిపారు. 

త్వరలో ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని, అనంతరం ఫిలిప్పీన్స్‌ వెళ్లి నేరుగా ఆ దేశంతో చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. అది కార్యరూపం దాల్చితే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఇది మరో మంచి అవకాశం కానుంది.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు