Breaking News

పోలీసుల తీరు అమానుషం

Published on Fri, 01/26/2024 - 04:58

సాక్షి, హైదరాబాద్‌/కరీంనగర్‌ టౌన్‌/ ఏజీ వర్సిటీ: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూని వర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్ళిన ఘట నను రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థినిపై పోలీసుల చర్య అమానుషమని కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై తక్ష ణమే సమగ్ర విచారణ జరిపి  కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. 

ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది: బీజేపీ ఆగ్రహం
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీ రుద్రమ, బండారు విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడి, ఈ ఘటనపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. మహిళా నాయకురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ధర్నా చౌక్‌ను మూసేసి, ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిన దొర పాలనను అంతం చేసి ఒక ప్రత్యా మ్నాయాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి రేవంత్‌రెడ్డి మరో కొత్త దొరలా తయారయ్యారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్స్‌ వ్యవహరించిన తీరుతో సభ్యసమా జం తలదించుకుంటోందన్నారు. దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. 

ఇది అత్యంత అమానుషం: సబిత
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా  వచ్చిన మహిళా నేత పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుష చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై జులుం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందన్నారు. 

కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: బండి
ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అస హ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలిని జుట్టు పట్టుకుని స్కూటీపై ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకన్నా హేయమైన చర్య ఉంటుందా అని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బండి డిమాండ్‌ చేశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)