Breaking News

కర్రెగుట్టలో ఆపరేషన్‌-2 కగార్‌ ప్రారంభం

Published on Thu, 02/19/2026 - 09:10

సాక్షి, ఖమ్మం జిల్లా: కర్రెగుట్టలో ఆపరేషన్‌-2 కగార్‌ ప్రారంభమైంది. 5 వేల మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్ట్‌ అగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌-2 కగార్‌ సాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది కోసం కూంబింగ్ చేపట్టగా.. మరో వైపు లొంగుబాటుకు అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ఇంకా 40 రోజులే ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్‌ మిగిలి ఉంది.

దీంతో కేంద్ర హోంశాఖ మావోయిస్టుల కార్యకలాపాలపై మరింత దృష్టి సారిస్తోంది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సైతం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో ఇంకా కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలపై ఆరా తీస్తోంది. ఆపరేషన్‌ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ అడవులు, మహారాష్ట్ర, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది పలువురు కీలక నేతలతో పాటు వందలాది మావోయిస్టులు ఎదురుదాడుల్లో మృతిచెందారు. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ అగ్రనేత మోస్ట్‌ వాంటెడ్‌, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా కూడా మృతి చెందారు.  ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా, ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది.

నక్సలైట్‌ ఉద్యమం ఇప్పటికే చావుదెబ్బ తిన్నదని, దేశవ్యాప్తంగా ఇంకా 300 మంది నక్సల్స్‌ మాత్రమే మిగిలి ఉన్నారని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. వారిలో నలుగురు సీనియర్‌ కమాండర్లున్నట్టు అధికారులు చెబుతున్నారు. వీరందరినీ కూడా మట్టుబెడితే ఈ మార్చి నెలాఖరు నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యం నెరవేరినట్టేనని అంటున్నారు. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు మిసిర్‌ బెస్రా అలియాస్‌ భాస్కర్, దేవ్‌జీ అలియాస్‌ కుంభా దాదా అలియాస్‌ చేతన్, రామన్న అలియాస్‌ గణపతి అలియాస్‌ లక్ష్మణ్‌ రావు, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాగర్‌ ఆచూకీ చిక్కలేదు. రాజిరెడ్డి మినహా ముగ్గురు చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

కర్రెగుట్టలు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా మారడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం. ఇవి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మావోయిస్టులు ఒక రాష్ట్రంలో ఆపరేషన్ ఎదురైతే వెంటనే మరొక రాష్ట్రం అడవుల్లోకి పారిపోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ గుట్టలు అత్యంత ఎత్తుగా, దట్టమైన చెట్లతో, లోయలతో కూడిన ప్రాంతం. బలగాలు సులభంగా లోపలికి చొచ్చుకుపోవడానికి వీలుండదు. ఈ క్లిష్టమైన భూభాగం గెరిల్లా యుద్ధానికి, అజ్ఞాతంలో ఉండటానికి అనుకూలంగా ఉంటాయి. స్థానికుల సమాచారం మేరకు ఈ గుట్టలపై మావోయిస్టు అగ్రనాయకులకు చెందిన బంకర్లు (భూగర్భ స్థావరాలు) కూడా ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)