Breaking News

3 ట్రిలియన్‌ ఎకానమీ సాధించేదెలా?

Published on Sat, 10/11/2025 - 06:16

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధి కోణం ఎలా ఉండాలన్న దానిపై రాష్ట్ర ప్రభు­త్వం ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047 పేరుతో మొత్తం 8 అంశాలపై ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే 25వ తేదీ వరకు కొనసాగనుంది.ప్రజలు తమ విలు­వైన అభిప్రాయాలను ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వాల­ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ­లో­ని ప్రతి పౌరుని జీవన ప్రమా­ణా­లను మెరు­గుç­³ర్చడమే ఎజెండాగా ఈ రైజింగ్‌ కాన్సె­ప్ట్‌ను ముందుకు తీసుకెళుతోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, జిల్లా, పట్టణం, నగ­రా­ల్లోని ప్రజల స్వరం, కలలు, ఆలోచనల ఆస­రాగా భవిష్యత్‌ తెలంగాణ కోసం రూపొందిస్తోన్న ఈ విజన్‌ సాధ్యమని భావిస్తోంది. అందులో భాగంగానే 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. సర్వేలో భాగంగా 8 ప్రశ్నలను రూపొందించింది. ప్రతి ప్రశ్నకు కొన్ని సమా­ధా­­నాలిచ్చి వాటిలో ఎలా వెళితే బాగుంటుందో సూచించాలని కోరింది. https://www. telangana.gov. in/ telanganarising/  అనే వెబ్‌సైట్‌లో ఈ సర్వేను పొందుపరిచింది.

సర్వేలోని అంశాలివే
త్రీ ట్రిలియన్‌ ఎకానమీ: 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ ఎకనామీ సాధించడంలో భాగంగా ఉద్యోగాలకు అవసరమైన రంగాల్లో కోర్సులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వాతావరణం కల్పనలో భాగంగా విధానాల్లో సంస్కరణల అమలు, యువత నాయకత్వంలో వ్యాపారాలు.

మీ ఆలోచన మేరకు ఈ విజన్‌: వీలున్నంత సమీపంలో మంచి పాఠశాలలు, ఆస్పత్రుల ఏర్పాటు, మీమీ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార అవకాశాల కల్పన, మహిళల రక్షణ, మరిన్ని అవకాశాల కల్పన, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆధునిక సేవలు.

అభివృద్ధి రంగాలు..: ఐటీ–ఏఐ–సైబర్‌ సెక్యూరిటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌–అగ్రిటెక్‌–కోల్డ్‌ స్టోరేజి, ఫార్మా– బయోటెక్‌–ఆరోగ్య ఆవిష్కరణలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు సెమీకండక్టర్ల తయారీ, పర్యాటకం–సాంస్కృతిక–సినీ–సృజనాత్మకత, డ్రోన్స్‌–అంతరిక్ష శాస్త్రం–రక్షణ.

మెరుగైన జీవితం..: అందరికీ స్వచ్ఛమైన గాలి, నీటి లభ్యత, మెరుగైన పారిశుధ్యం, చివరి మైలు వరకు బస్సు, రైలు మార్గాల అనుసంధానం, రక్షిత, సరసమైన గృహ సదుపాయం.
ఆరోగ్యం, శ్రేయస్సు...: ప్రతి మండలానికి ఆస్పత్రి, మొబైల్‌ ఆరోగ్య వాహనం ఏర్పాటు, తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు, మందులు, టెలీమెడిసిన్‌ లభ్యత, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, వ్యాధి నియంత్రణ, సరసమైన ధరలకు మానసిక ఆరోగ్య కౌన్సెలర్ల లభ్యత, ఆరోగ్య బీమా.

విద్య, నైపుణ్యాలు..: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వాతావరణ, పారిశ్రామిక రంగాలపై బోధన, ఆధునిక శిక్షణ పరికరాలు, సుశిక్షుతులైన ఉపాధ్యాయులు, కళాశాలలు, ఐటీఐలలో నైపుణ్య ఆధారిత కోర్సులు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సానుకూలత కల్పించడం, సాఫ్ట్‌ స్కిల్స్‌ అభివృద్ధి.

పాలన–పౌర సేవలు..: అన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఒకటే పోర్టల్‌. ప్రజలకు అందుబాటులో ప్రతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమాచారం, తగినన్ని నిధులు, అధికారాలతో స్థానిక సంస్థల బలోపేతం.

2047లో తెలంగాణ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారు?..: (పైన పేర్కొన్న ఏడు అంశాలపై ప్రజల నుంచి ఆప్షన్లను కోరిన ప్రభుత్వం 8వ అంశానికి సంబంధించి తెలంగాణ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారో తమ ఆలోచనను అక్షర లేదా స్వర రూపంలో ఇవ్వాలని సర్వేలో కోరింది.)

కేవలం విధాన పత్రం కాదు.. ఉమ్మడి స్వప్నం
తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 అనేది కేవలం విధాన పత్రమే కాదు. తెలంగాణ ప్రజల ఉమ్మడి స్వప్నం కావాలి. రాష్ట్ర భవిష్యత్‌ నిర్మాతలు ప్రజలే. ప్రజలందరూ కొంత సమయాన్ని వెచ్చించి ఈ చారిత్రక కసరత్తులో భాగస్వాములై మీ విలువైన అభిప్రాయాలను అందించాలి. –జయేశ్‌ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)