Breaking News

ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థి ఏడాది సస్పెన్షన్‌ 

Published on Fri, 10/20/2023 - 08:36

గాంధీఆస్పత్రి : ర్యాగింగ్‌ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యారి్థని ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ యాంటీ ర్యాగింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్,   గాంధీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమేష్రెడ్డి నేతృత్వంలో గురువారం  కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనాటమీ విభాగంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్‌ బాక్స్‌లో ర్యాగింగ్‌కు సంబంధించి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టగా 2020 బ్యాచ్‌కు చెందిన ఓ విద్యార్థి పలుమార్లు  జూనియర్లను ర్యాగింగ్‌ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సదరు విద్యారి్థని ఏడాది పాటు హాస్టల్‌తోపాటు కళాశాలను నుంచి సస్పెండ్‌ చేస్తూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గతంలో ర్యాగింగ్‌కు పాల్పడి సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులు, వారి తల్లితండ్రులు యాంటి ర్యాగింగ్‌ కమిటీని కలిసి మరోమారు ర్యాగింగ్‌కు పాల్పడమని, సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరగా, కమిటీ  వారి అభ్యర్థనను ఏకగ్రీవంగా తిరస్కరించింది. క్రిమినల్‌ కేసులు నమోదు చేయకుండా కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

యాంటీ ర్యాగింగ్‌ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇకపై ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై పోలీస్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గాం«దీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, కాలేజీకి చెడ్డపేరు తెచ్చెవారిని ఉపేక్షించరాదని తీర్మానించి, ర్యాగింగ్‌ నిరోధానికి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో గాంధీ వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్, సూపరింటెండెంట్‌ రాజారావులతోపాటు పలు విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.   

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)