గురుకుల దరఖాస్తుకూ ‘పరీక్షే’! హెల్ప్‌డెస్క్ ఉంది.. కానీ, సాయం అందదు

Published on Fri, 05/19/2023 - 03:22

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల ఉద్యోగాల దరఖా స్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది. నోటిఫికేషన్లు జారీచేసి నెలైనా సాంకేతిక సమస్యలు తీరకపోవ డంతో ఆభ్యర్థులు సతమతమవుతున్నారు. వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌)లో తలెత్తుతున్న సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగట్లేదు.

ఒకే అభ్యర్థి పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిసారీ వివరాలు నమోదు కష్టమని భా వించి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఈ విధానాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే బోర్డు గత నెల 5న 9 ఉద్యోగ ప్రకటనలు జారీచేయగా.. ఏప్రిల్‌ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కానీ ఓటీఆర్, దరఖాస్తు ప్రక్రియలోని సాంకేతిక సమస్యలు అభ్యర్థులను చికాకుపెడుతున్నాయి.  

‘దరఖాస్తు’కే చుక్కెదురు.. 
సంక్షేమ గురుకులాల్లో 9 కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో జేఎల్, డీఎల్‌ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 17తో ముగిసింది. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు దరఖాస్తు గడువు వచ్చే వారంలో ముగియనుంది. అయితే, ఆయా పోస్టులకు తొలి వారం రోజులు సర్వర్‌ సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది.

పెద్దసంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను తెరవడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ, దరఖాస్తు గడువు ముగిసే వరకు కూడా సాంకేతిక సమస్యలు అలాగే ఉండడంతో చాలామంది దరఖాస్తు చేయలేకపోయారు. కనీసం గురుకుల పాఠశాలల్లో కొలువులకు దరఖాస్తు ప్రక్రియలోనైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఇక, దరఖాస్తు, ఇతర సాంకేతిక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి గురుకుల బోర్డు ఫోన్‌నంబర్, ఈ–మెయిల్‌తో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేసింది. అయితే ఇది వినతుల స్వీకరణకే పరిమితమైందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్లుచేసినా స్పందించట్లేదని బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి. 

వారం పట్టింది 
గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుకు వారం పట్టింది. ఓటీఆర్‌ కోసం వరుసగా ఐదురోజుల పాటు ప్రయత్నించాను. ఏడాదిన్నరగా జేఎల్, డీఎల్‌ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుండగా.. కేవలం దరఖాస్తు ప్రక్రియే కష్టమైపోయింది. – డి.నర్సింగ్‌రావు, కొడంగల్, వికారాబాద్‌ జిల్లా 
 
ఓటీఆర్‌ నమోదు కాక  దరఖాస్తుకు దూరమయ్యాను 
ఓటీఆర్‌ కోసం పదిరోజులు ప్రయత్నించాను. మాసాబ్‌ట్యాంక్‌లోని బోర్డు కార్యాలయానికి వెళ్లి చెప్పాను. ప్రయోజనం లేకపోగా, చివరకు దరఖాస్తు చేయకుండానే జేఎల్, డీఎల్‌ గడువు ముగిసిపోయింది. గడువును వారమైనా పొడిగించాలి.   – చీపురు ప్రవీణ్‌కుమార్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా  

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)