Breaking News

Banjara Hills: అక్కా అంటూ పరిచయం చేసుకుని...

Published on Mon, 02/10/2025 - 11:19

బంజారాహిల్స్‌(హైదరాబాద్): అక్కా అంటూ పిలుస్తూ ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మోతీనగర్‌లో నివసించే బత్తుల శివ (33) కారు డ్రైవర్‌గా జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–45లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ డైరెక్టర్‌ వద్ద పనిచేస్తున్నాడు.

 అదే కంపెనీ బిల్డింగ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకుని అక్కా అంటూ తరచూ ఇంటికి వెళ్తూ ఆమె భర్తతో కలిసి మద్యం తాగేవాడు. శనివారం రాత్రి బాధిత యువతి తండ్రి తీర్థయాత్రలకు వెళ్లగా, తల్లి అదే బిల్డింగ్‌ మొదటి అంతస్తులో పని కోసం వెళ్లింది. బాధితురాలి సోదరుడు కూడా అదే బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా మొదటి అంతస్తులో ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు. రాత్రి 11.30 గంటల వరకు ఇద్దరు మాట్లాడుకున్నాక..ఇక తాను వెళ్తానని శివ చెప్పగా యువతి బెడ్‌పై నిద్రకు ఉపక్రమించింది.

 అరగంట తర్వాత ఆమె మేల్కొనగా..శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా అరవాలని ప్రయత్నించింది. దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోదిస్తూ తల్లికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 64 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)