చిన్న రాష్ట్రం.. వేతన కష్టం

Published on Mon, 06/22/2026 - 06:05

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని చిన్న రాష్ట్రాలు ఏటా పెట్టే మొత్తం ఖర్చులో పావలా వంతు ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నాగాలాండ్, మణిపూర్, హిమాచల్‌ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మిజోరం రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్‌లో 25 శాతానికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే వెచ్చించాయి. అత్యధికంగా నాగాలాండ్‌ మొత్తం బడ్జెట్‌లో 37 శాతం వేతనాలకు ఖర్చు చేసినట్లు కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘స్టేట్‌ ఫైనాన్సెస్‌’పేరుతో కాగ్‌ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2015–16 నుంచి 2024–25 వరకు పదేళ్లపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితులను ఈ నివేదికలో వెల్లడించింది. 
 
ఏ రాష్ట్రంలో ఎలా ఉందంటే..  
2024–25లో వేతనాలకు తెలంగాణ మొత్తం బడ్జెట్‌లో 14.19 శాతం ఖర్చు చేస్తోంది. ఏపీ (16.96%), కేరళ (22.96%) కూడా వేతనాలకు గణనీయంగానే ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక (6.59 శాతం), మహారాష్ట్ర (8.51%) మాత్రం తక్కువ నిధులు వెచ్చిస్తున్నాయి.  


⇒ వేతనాలకే కాక ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల కోసం కూడా చిన్న రాష్ట్రాలే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా తన ఏడాది బడ్జెట్‌లో పింఛన్లకు హిమాచల్‌ ప్రదేశ్‌ 19,63 శాతం ఖర్చు చేస్తుండగా.. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌ 5.84 శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది. ఇక, దక్షిణాది విషయానికి వస్తే కేరళ టాప్‌లో నిలిచింది. ఈ రాష్ట్రంలో పింఛన్ల కోసం 16.04 శాతం ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 7.77 శాతం ఖర్చు చేస్తోంది.  

⇒ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 19 శాతం నిధులను వడ్డీల కోసం పంజాబ్‌ ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 13 శాతం ఖర్చు పెడుతోంది. అత్యల్పంగా ఒడిశా 2.52 శాతం మాత్రమే చెల్లిస్తోంది.  

⇒ ఆహార, విద్యుత్, ఇతర సబ్సిడీల కింద దేశంలోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 14 శాతం నిధులు సబ్సిడీల కోసమే ఖర్చు చేస్తుండగా, అందులో సగం మాత్రమే మన రాష్ట్రంలో సబ్సిడీల రూపంలో ఖర్చవుతోంది. దేశంలోనే అత్యల్పంగా మొత్తం బడ్జెట్‌లో 0.02 శాతం మాత్రమే అరుణాచల్‌ ప్రదేశ్‌లో సబ్సిడీల కింద ఖర్చవుతోంది. కేరళలో ఇది 1.07 శాతమే కావడం గమనార్హం. 
   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)