బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!

Published on Wed, 04/02/2025 - 11:19

చందుర్తి (వేములవాడ): బాకీ డబ్బుల వివాదంలో తన భార్య చేయి పట్టుకున్నారని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చందుర్తి ఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. 

వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన బోదాసు రాజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి దేవయ్య, దండుగుల నరేశ్‌ వద్ద ఏడేళ్ల క్రితం రెండు తులాల బంగారాన్ని అప్పుగా తెచ్చుకుని జీవనోపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. కొన్నాళ్లకు రెండు తులాల బంగారం తిరిగిచ్చాడు. ఒప్పందం ప్రకారం మరో తులం బంగారం బాకీ ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రాజు గల్ఫ్‌ నుంచి స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 

అప్పటినుంచి దేవయ్య, నరేశ్‌ బంగారం కోసం రాజును వేధిస్తున్నారు. మంగళవారం కూడా వచ్చి తులం బంగారం అడిగారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ‘నీ భార్యను తీసుకెళ్తేనే బంగారం ఇస్తావు..’అంటూ దేవయ్య, నరేశ్‌.. రాజు భార్య చేయి పట్టుకోవడంతో మనస్తాపానికి గురైన అతడు అక్కడే ఉన్న పురుగుల మందు తాగాడు. రాజు భార్య ఫిర్యా దు మేరకు దేవయ్య, నరేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య వివరించారు.    

#

Tags : 1

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)