Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

Published on Fri, 04/18/2025 - 08:11

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసగా మారిన బీటెక్‌ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్‌ జిల్లాకు చెందిన పవన్‌ (30) తన స్నేహితులు గౌతమ్, రోహితులతో కలిసి అత్తాపూర్‌లో ఉంటున్నారు. 

కొంత కాలంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడిన పవన్‌.. తన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేశాడు. బీటెక్‌ చదివిన కుమారుడు ప్రయోజకుడు కావాలని పవన్‌ తండ్రి పెద్ద నర్సింహులు వ్యవసాయాధారిత పంటలపై వచి్చన డబ్బులను కూడా ఇస్తుండేవాడు. 

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చని భావించిన పవన్‌ తన బుల్లెట్‌ వాహనాన్ని, ఐఫోన్‌ను సైతం విక్రయించి మరీ బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. స్నేహితులు, బంధువుల వద్ద తీసుకున్న డబ్బులు కూడా పోగొట్టుకోవడంతో మానసికంగా కుంగిపోయిన పవన్‌ నిరాశతో గదిలో స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)