Breaking News

ఫాదర్స్‌డే రోజున నాన్న లేడాయే...

Published on Sun, 06/15/2025 - 13:28

నెహ్రూసెంటర్‌: భర్త మరణం భార్యకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహ వార్షికోత్సవం తర్వాత రోజే విద్యుత్‌ ప్రమాదరూపంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. మరోచోట కరెంట్‌ షాక్‌తో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్‌ మండలంలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్‌ (32) ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేస్తూ శనివారం విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. క్రాంతికుమార్‌ మృతితో భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.

సంతోషం.. మరునాడే విషాదం
మృతుడు క్రాంతికుమార్‌ దంపతులు శుక్రవారం పెళ్లిరోజు వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాంత్రి మరుసటి రోజే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తమను సంతోషంగా చూసుకుంటాడనుకున్న భర్త మృతితో భార్య రోదనలు మిన్నంటాయి.

ఫాదర్స్‌డే రోజున నాన్న లేడాయే...
క్రాంతికుమార్‌కు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నేడు అందరూ ఫాదర్స్‌ డే జరుపుకుంటుండగా చిన్నారులకు మాత్రం కన్నతండ్రి దూరమైన పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చిన్నారులు తమ తండ్రి చనిపోయిన విషయాన్ని సైతం తెలుసుకునే వయస్సులో లేకపోవడం కలిచివేస్తుంది.

ఇనుగుర్తిలో ఘటన...
జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల విద్యుత్‌ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డోర్నకల్‌లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన బూర్గుల అంబేడ్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లో ఆస్పత్రికి తరలించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)